- ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలో విధివిధానాలు రూపొందించిన 17 రాష్ట్రాలు
- రాజ్య సభలో వెల్లడించిన కేంద్రం.
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : గడిచిన ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార సబ్సిడీ కింద తెలంగాణ రాష్ట్రానికి 26,765.22 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఇందులో 2016-17 ఏడాదికి గానూ 1,716.71 కోట్లు, 2017-18 గాను 3,853.71కోట్లు, 2018-19 గాను 2,559.31 కోట్లు, 2019-20 గానూ, 4,858.89 కోట్లు, 2020-21 గాను 6,879.6 కోట్లు, 2021-22 6,897 కోట్లు(ఈ రోజు వరకు) కేటాయించినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందులో 2020-21, 2021-22 గాను ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పిఎంజికెఏవై) సబ్సిడీ నిధులు కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజ్య సభలో ఎంపి జీవిఎల్ నర్సింహా రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మౌకికంగా సమాధానం ఇచ్చారు.
అన్ని రాష్ట్రాలకు లబ్ధిదారుల కవరేజీని 2013లో అప్పటి ప్రణాళికా సంఘం(ప్రస్తుత నీతి ఆయోగ్), నేషనల్ సాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) హౌస్ హోల్డ్ కన్జెంషన్ ఎక్స్‌పెండిచర్ సర్వే 2011-12 ఆధారితంగా నిర్ణయించిందని చెప్పారు. దీని ప్రకారం, తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనాలను పొందుతున్నట్లు మంత్రి సభకు తెలిపారు. అలాగే, పక్క రాష్ట్ర మైన ఆంధప్రదెశ్‌కి 22,223 కోట్ల రూపాయల ఆహార సబ్సిడీ అందించినట్టు మంత్రి వెల్లడించారు.
ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలో విధివిధానాలు రూపొందించిన 17 రాష్ట్రాలు
ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలో దేశంలోని 17 రాష్ట్రాలు పాలసీలు రూపొందించాయని కేంద్రం వెల్లడించింది. ఇందులో తెలంగాణ, ఆంధప్రదేశ్ తో పాటు ఢిల్లీ, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తదితర రాష్ట్రాలు ఉన్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్‌పాల్ గుర్జార్ సమాధానం ఇచ్చారు. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాష్ట్రాల పాలసీలు అదనంగా సహాయపడతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ సుజీత్ కుమార్ ప్రశ్నకు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అన్సర్ ఇచ్చారు.