మిల్క్ సేల్స్ బాగా పెరిగాయట
పాలాభిషేకానికి తరలాయట
సీఎం ఫ్లెక్సీ లు తడిచాయట
పీఆర్సీకి కేబినెట్ ఆమోదం
ఉద్యోగ సంఘాల మోదం
ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కుప్పలు
అమ్మకానికి రాత్రి పగలు పడిగాపులు
వడ్లు నింపేందు బార్దాన్ కరువు
వానలకు తడిసి మొలకెత్తిన దాన్నం
అన్నదాత తీరు కన్నీరు అయిన దైన్యం
వాళ్ళను పట్టించుకునే టోడు ఎవడు
అటువైపు కన్నెత్తి చూసెటోడు లేడు
నోరున్నోడిదే ఊరు
కర్ర ఉన్నోడిదే బర్రే
చూసారా ఇదేమి రాజ్యం!!
సర్కారు ఉద్యోగులు భోజ్యం!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్టు, ప్రజాతంత్ర