Take a fresh look at your lifestyle.

22‌న జనతా కర్ఫ్యూ పాటించండి

  • ఆ రోజు ఎవరూ బయటికి రావొద్దు
  • సంఘటితంగా కొరొనా మహమ్మారిని తరిమికొడదాం
  • దృఢ సంకల్పం, సంయమనంతో కట్టడి సాధ్యమే
  • కొన్ని వారాలు సమయమివ్వండి, కలసి పోరాడదాం
  • జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

ప్రపంచాన్ని వణికిస్తున్న కొరొనా మహ్మమ్మారిని దేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా ఏకం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ మహమ్మారి కట్టడి కోసం ఈనెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని పిలుపునిచ్చారు. ప్రజల కోసం ప్రజలే స్వచ్చందంగా చేసుకున్న ఈ కర్ఫ్యూ కొరనాపై• దేశ ప్రజలు చేసే అతి పెద్ద యుద్ధంగా పరిగణించాలని కోరారు. కొరోనా వైరస్‌ ‌బాధితుల సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం దేశం గంభీరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నదనీ, ప్రజలు దీని నుంచి బయట పడేందుకు స్వీయ నియంత్రణ చర్యలను పాటించాలని కోరారు.

భారత్‌ ‌వంటి 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో కొరోనా వంటి మహమ్మారిని విస్తరించకుండా చేయడం అంత సులవైన పని కాదనీ, అయితే, ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చని సూచించారు. దేశంలోని ప్రతీ వ్యక్తి ఈ వైరస్‌ ‌బారిన పడకుండా కాపాడుకోవడంతో పాటు ఇతరులకు సోకకుండా చూడటం ద్వారా దేశాన్ని స్వస్త్ ‌భారత్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పేర్కొన్నారు. వచ్చే కొన్ని వారాల పాటు అవసరమతై తప్ప ఎవరూ బయటికి రావొద్దనీ, మార్కెట్లు, సినిమా థియేటర్లు, రద్దీ ప్రాంతాలకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని వ్యాఖ్యానించారు. కొరోనా ఏ ఒక్కరితోనే పరిష్కారమయ్యే సమస్య కాదనీ, దీనిని ఎదుర్కునేందుకు దృఢ సంకల్పం, సంయమనం ద్వారా దీనిని సాధ్యం చేయవచ్చని పేర్కొన్నారు.

ప్రపంచంలోని అతి వేగంగా అభివృద్ధిని సాధిస్తున్న దేశాలలో సైతం ఈ వైరస్‌ అతి వేగంగా విస్తరిస్తున్నదనీ, దీనిని నియంత్రించేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి మందులు, ఇంజక్షన్లు కనిపెట్టలేదని చెప్పారు. ఓ విస్పోటనం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటున్నదనీ, అన్ని రాష్ట్రాల సమన్వయంతో దీనిని ఎదుర్కొందామన్నారు. ప్రజలు పరస్పరం సామాజిక దూరం పాటించాలని సూచించారు. కొరొనా కారణంగా దేశం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో ఎ•నమిక్‌ ‌టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ టాస్క్ ‌ఫోర్స్ ‌ప్రతీరోజు జరిగే ఆన్ని ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తుందన్నారు.వచ్చే కొన్ని వారాలు నాకు సమయమిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలిపారు.

Leave a Reply