Take a fresh look at your lifestyle.

పట్టణాల్లో మౌలిక వసతులపై దృష్టి

  • జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు
  • టీఎస్‌ ‌బీపాస్‌ ‌వెబ్‌సైట్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌

‌ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతున్నదని, రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందువల్ల పట్టణాల్లో మౌలిక వసతులపై దృష్టిపెట్టామన్నారు. పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతుల కోసం కొత్తగా రూపొందించిన టీఎస్‌ ‌బీపాస్‌ ‌వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. టీఎస్‌ ‌బీపాస్‌ ‌ద్వారా అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చామని వెల్లడించారు. ప్రజలకు మేలు జరిగేలా టీఎస్‌ ‌బీపాస్‌ ‌వెబ్‌సైట్‌ ‌తీసుకొచ్చామని అన్నారు.

75 గజాల వరకు స్థలం ఉంటే ఎలాంటి అనుమతి అవసరం లేదని, రిజిస్ట్రేషన్‌ ఉం‌టే సరిపోతుందని చెప్పారు. 75 నుంచి 600 గంజాల వరకు ఇంటిస్థలం ఉంటే స్వీయధ్రువీకరణ ద్వారా అనుమతులిస్తామని తెలిపారు. నిర్దేశిత గడువులోగా అనుమతులు, ధ్రువపత్రాలు వొస్తాయని ప్రకటించారు. 600 గజాలపైన ఉంటే స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో అనుమతులు వొస్తాయన్నారు. అన్నిశాఖలు సమన్వయం చేసుకుని 21 రోజుల్లోగా అనుమతులు జారీచేస్తారని తెలిపారు. ఇలాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. ఇకపోతే తెలంగాణలో పరిపాలనను వికేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకుటున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Leave a Reply