Take a fresh look at your lifestyle.

ఇక అభివృద్దిపైనే దృష్టి సారించాలి

తెలంగాణకు సంబంధించినంత వరకు ఇక అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. సప భవిష్యత్‌లో ఎలాంటి ఎన్నికలకు అవకాశం లేదు. అలాగే తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు,సిఎం కెసిఆర్‌కు తిరుగులేదని

తెలంగాణకు సంబంధించినంత వరకు ఇక అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. సప భవిష్యత్‌లో ఎలాంటి ఎన్నికలకు అవకాశం లేదు. అలాగే తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు,సిఎం కెసిఆర్‌కు తిరుగులేదని కూడా నిరూపితం అయ్యింది. ఈ దశలో ఇక అనేకానేక అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇచ్చిన హాలు అమలు కావాల్సి ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగావ కాశాలు పెరగాలి. స్వయం ఉపాధి పథకాలు ముందుకు సాగాలి. సిఎం కెసిఆర్‌ ‌స్థానంలో కెటిఆర్‌ ‌సిఎం కావాలన్న ప్రచారం కన్నా తెలంగాణ ముందుకు సాగాలన్న ప్రచారంలో మంత్రులు ఉండాలి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు సంకల్పం తీసుకోవాలి. అప్పుడే ప్రజల్లో భరోసా పెరగగలదు. ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఎదురేలేదని ప్రజలు నిరూపిస్తున్నారు. తాజాగా ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల్లో దాదాపు 99శాతం పురపాలికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. సీఎంగా కేసీఆర్‌ ‌రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, అందిస్తున్న పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ఈ ఎన్నికలతో మరోసారి స్పష్టమైందనే చెప్పాలి. సీఎం కేసీఆర్‌ ‌పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రజలు కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్షాల మాటలను ఏమాత్రం నమ్మని ఓటర్లు కారు గుర్తు అభ్యర్థులను గెలిపించుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఒక్కో ఓటుకు వేల రూపాయలు వెచ్చించినా ప్రజలు సీఎం కేసీఆర్‌ ‌పథకాల నుంచి పొందుతున్న లబ్దికే తమ ఓటని బ్యాలెట్‌తో విపక్షాలకు సమాధానం చెప్పారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా అధికార పార్టీ విజయదుందుభి మోగిస్తూనే ఉన్నది. అది కూడా ప్రత్యర్థి పార్టీలకు కలలో కూడా సాధ్యం కాని మెజార్టీతో అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.

తాజా పరిణామాలతో ఇప్పటికే నామ మాత్రంగా ఉన్న విపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు, గ్రామపంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలన్నింటిలోనూ టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ప్రజలు మరోసారి స్పష్టమైన తీర్పునిచ్చి ఉద్యమ పార్టీకే అండగా ఉంటామని నిరూపించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచార అస్త్రాలుగా ఇంటింటికీ వెళ్లాలన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌సూచనలతో అన్ని మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకున్నది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ,ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అదే ఒరవడిని కొనసాగిస్తూ ఎంపీలను గెలిపించుకున్నది. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జాతీయ రికార్డులను తిరగరాస్తూ 93 శాతం స్థానాలను టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కైవసం చేసుకున్నది. ఈ ఎన్నికల్లోనూ ప్రజలు అధికార పార్టీ అభ్యర్థులనే గెలిపించుకొని సీఎం కేసీఆర్‌ ‌పాలన ద, మంత్రి కేటీఆర్‌ ‌కార్యదక్షత ద తమకున్న నమ్మకాన్ని చాటారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌కారు జోరు చూపించింది. ఈ ఎన్నికలను తన పనితీరును కొలమానంగా తీసుకుంటానని ప్రకటించిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ప్రజలు వందకు వందశాతం మార్కులు వేశారు. దీనికితోడు సీఎం కేసీఆర్‌ ‌పాలనపై తమకు ఉన్న విశ్వాసాన్ని ప్రజలు మరోసారి ఓట్ల రూపంలో వెల్లడించారు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ గులాబీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మున్సిపాలిటీలలో అధికార పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. అలాగే మున్సిపాలిటీల పీఠాలపై అధికార పార్టీకి చెందిన చైర్మన్లు, వైస్‌ ‌చైర్మన్లు ఎన్నిక య్యారు.

కేసీఆర్‌ ఆడపిల్లలకు పెద్దన్నలాగా ఉంటూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు ఆర్థిక సాయం అందిస్తూ పెండ్లిళ్లకు సాయం చేయడం, ఎవరి సాయం లేని దివ్యాంగులకు అన్నీ తానై అందిస్తున్న పింఛన్లు, కుటుంబంలో తానే పెద్ద కొడుకై అందిస్తున్న వృద్దాప్య పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, ఇతర పథకాల నుంచి లబ్దిపొందుతున్న ప్రతి ఒక్కరూ మరో ఆలోచన లేకుండా కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించారు. అలాగే అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికారం కట్ట బెట్టారు. మొత్తానికి అధికార పార్టీతోనే తమ కాలనీలు, వార్డులు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయన్న నమ్మకాన్ని ఉంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఉద్యమ కాలంలోనే అందరి కష్టాలు తెలుసుకుని పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు నచ్చి, మెచ్చి వేసిన ఓటుతో గెలిపించుకున్న నాటి ఉద్యమ రథసారథి, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పథకాలతో అన్ని వర్గాలు లబ్ది పొందుతున్నాయి.. దీంతో యావత్‌ ‌ప్రజానీకం టీఆర్‌ఎస్‌ ‌వెంటే ఉంటూ ఏ ఎన్నికలొచ్చినా గులాబీ జెండాకే పట్టం కడుతున్నారు.. అదే విషయాన్ని ఈ పురపాలిక ఎన్నికలతో మరోమారు రుజువు చేశారు. ఈ ఫలితాలు రాజకీయ చరిత్రలో పెనుమార్పునకు సంకేతంగా చూడాలి. సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలన్న సంకల్పం ప్రజల్లో కనిపిస్తోంది. మేనిఫెస్టో ఇచ్చి చేపట్టిన పనులు చాలా వరకు పూర్తికాగా కొన్ని పురోగతిలో ఉన్నాయని వీటితో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. అందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వెంటే ఉంటూ ఓటర్లంతా ఏకమై మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించి భారీ విజయం కట్టబెట్టారన్న భావన ఉంది. ప్రజల్లో నెలకొన్న నమ్మకం మేరకు అభిశవృద్దిని పరుగులు పెట్టిస్తే టిఆర్‌ఎస్‌కు తిరుగు ఉండదు.

Tags: Focus on state, improvement, telangana govt,cm kcr

Leave a Reply