Take a fresh look at your lifestyle.

బ్లాక్‌ ఫంగస్‌పై దృష్టి .. కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి

బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులపై కేంద్ర సర్కార్‌ ‌ప్రత్యేక దృష్టి పెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. కోఠి ఇఎన్‌టి హాస్పిటల్‌ ‌ను పరిశీలించిన ఆయన… కొరోనా తర్వాత బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు భారీగా పెరిగాయన్నారు. ఇఎన్‌టిలో 250 వరకు బెడ్ల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంఫోటెరిసిన్‌ ఇం‌జెక్షన్‌ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టామన్న కిషన్‌ ‌రెడ్డి….ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ ‌చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.  కోఠిలోని ఈఎన్‌టి హాస్పిటల్‌ ‌ని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి గురువారం సందర్శించారు.

బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌గతంలో ఏడాదికి ఒక కేసు ఈఎన్‌టికి వచ్చేదని, ఇప్పుడు కొరోనా తో భారీగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. అంపోటరిస్‌ అనే ఇంజక్షన్‌లు కొరత ఏర్పడిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయని, 11 ఫార్మా కంపెనీలు ఇంజెక్షన్‌ ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. ఈనెల 31వతేదీలోపు మూడు లక్షల ఇంజెక్షన్లు ఉత్పత్తి అవుతాయని, విదేశాల నుంచి జూన్‌ ‌మొదటి వారంలో రెండు లక్షల ఇంజెక్షన్లు అందుబాటులో వస్తాయని ఆయన చెప్పారు. 5690 ఇంజెక్షన్లు కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్రానికి పంపిందన్నారు. ప్రతి ఒక్కరూ కొరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కిషన్‌ ‌రెడ్డి సూచించారు. లాక్‌ ‌డౌన్‌లో అనవసరంగా రోడ్ల వి•దకు రాకూడదన్నారు. 70 శాతం యువకులు కోవిడ్‌ ‌భారిన పడుతున్నారని, తమికేవి• కాదనే నిర్లక్ష్యాన్ని వదిలి పెట్టాలన్నారు. మన దేశంలో 16 కంపెనీలలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి అవుతుందని, తెలంగాణలో మూడు కంపెనీల్లో వ్యాక్సిన్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. డిసెంబర్‌ ‌లోపు దేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ అం‌దుతుందని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply