Take a fresh look at your lifestyle.

దేశంలో రోజువారీ కొరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు

తాజాగా కొత్తగా 11,903 మందికి పాజిటివ్‌..311 ‌మంది మృతి
న్యూదిల్లీ, నవంబర్‌ 03 : ‌దేశంలో రోజువారీ కొరోనా కేసులు హెచ్చుతగ్గులతో నమోద వుతున్నాయి. దేశంలో తాజాగా 24 గంటల్లో 11,903 కొరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌తో 311 మంది మృతి చేందారు. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,43,08,140కి చేరుకుంది. అయితే క్రియాశీల కేసుల సంఖ్య 1,51,209కి తగ్గింది.

ఇది 252 రోజులలో కనిష్టంగా ఉంది. తాజాగా 311 రోజువారీ మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 4,59,191 కు చేరుకుంది. కొత్త కొరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్లతో రోజువారీ పెరుగుదల 26 రోజులుగా 20,000 కంటే తక్కువగా ఉంది. 129 రోజులుగా రోజువారీ కొత్త కేసులు 50,000 కంటే తక్కువగా నమోదవుతున్నాయి. క్రియాశీల కేసుల సంఖ్య 1,51,209కి తగ్గింది, మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.44%, మార్చి 2020 నుండి అతి తక్కువ కాగా జాతీయ రికవరీ రేటు 98.22 శాతం నమోదైంది. ఇది మార్చి 2020 నుండి చేస్తే అత్యధికమని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Leave a Reply