Take a fresh look at your lifestyle.

దేశంలో కొరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు

కొత్తగా 18,987 మందికి పాజిటివ్‌.. 246 ‌మంది మృతి
దేశంలో రోజువారీ కొరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 18,987 మందికి పాజిటివ్‌ ‌నమోదు కాగా..246 మంది మృతి చెందారు. 19,807 మంది కొరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3,40,20,730కి చేరగా.. మొత్తంగా 4,51,435 మృతి చెందారు. కొరోనా నుంచి మొత్తం 3,33,62,709 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం 2,06,586 యాక్టీవ్‌ ‌కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 96,82,20,997 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ ‌బులిటెన్‌లో వెల్లడించింది.

Leave a Reply