Take a fresh look at your lifestyle.

నేడు గాంధీ దవాఖానా వైద్య సిబ్బందిపై పూల వర్షం

‌కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై ఆదివారం పూల వర్షం కురవనుంది. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కొరోనా బాధితులను రక్షించేందుకు అనుక్షణం తపిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపేందుకు భారత వాయుసేనకు చెందిన ఎయిర్‌ఫోర్స్ ‌హెలికాప్టర్లు పూలవర్శం కురిపించనున్నాయి.

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 30 గంటల మద్యలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రొ.జయశంకర్‌ ‌విగ్రహం వద్ద వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ ‌సిబ్బంది, శానిటేషన్‌ ‌సిబ్బందిపై ఐఏఎఫ్‌ ‌హెలికాప్టర్ల ద్వారా అధికారులు పూలవర్షం కురిపించనున్నారు. డాక్టర్‌ ‌నుంచి స్వీపర్‌ ‌దాకా వైద్య సిబ్బందిపై ఆకాశం నుంచి గులాబి పూల వర్షం కురిపించి హకీంపేటకు చెందిన ఎయిర్‌ఫోర్స్ అధికారులు అభినందనలు తెలుపుతారు.

Leave a Reply