ఒకప్పుడు పందు లకు, కుక్కలకు, చెత్తాచెదారానికి నిలయం…పక్కనుండి వెళ్తేనే దుర్గం ధమైన వాసన…ఎప్పుడు జనంతో కిక్కిరిసిన ప్రాంతమైనప్పటికి పట్టించుకున్న పాపాననే పోలేదు. కానీ ప్రభుత్వం పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రతి ష్టాత్మకంగా అమలుచేస్తున్న తరు ణంలో అదొక సుందరమైన ప్రాం తంగా తయారైంది.
అదెక్కడో కాదు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చెత్తాచెదా రాన్ని తొలగించి పందులకు, కుక్కల నిలయానికి తావులేకుండా చేయడమే గాకుండా పూలమొక్కలను నాటడం జరిగింది. 24వ వార్డు స్పెషల్ అధి కారిగా తరిగొప్పుల డిప్యూటి తహశిల్దార్ సరితారాణి ఆధ్వర్యంలో కౌన్సిల ర్, నాయకులు, మహిళలు పాల్గొని సుందరీకరణ చేయడమే గాకుండా అక్కడ మంచి వాతావరణాన్ని కల్పించడంలో సఫలీకృతులయ్యారు. 24వ వార్డు ప్రజలు స్పెషల్ అధికారిణి సన్మానం చేయడం జరిగింది.