Take a fresh look at your lifestyle.

తెలంగాణలో పూల పండుగ సంబురాలు షురూ

9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు
మహిళల ఆటపాటలతో హోరెత్తనున్న పల్లెలు
24న సద్దుల బతుకమ్మతో సమాప్తం

‌తెలంగాణ రాష్ట్రంలో పూల పండుగ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో రంగురంగుల హరివిల్లుల వర్ణాలతో  పేర్చి ఆడపడచులు ఆడిపాడే బతుకమ్మ పాటలతో శుక్రవారం తెలంగాణలోని పల్లెల నుంచి పట్టణాల వరకూ సందడిగా మారాయి. బతుకమ్మ పండుగలో భాగంగా తొలి రోజైన శుక్రవారం ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై ఆడబిడ్డలు గౌరమ్మను భక్తి శ్రద్ధలతో పూజించి తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మతో గం•మ్మ ఒడిలో•లో నిమజ్జనం చేస్తారు. వివాహితలు ఈ పండగ కోసం ప్రత్యేకంగా తమ పుట్టింటికి చేరుకుంటారు. ప్రతీ రోజూ సాయంకాలంతో మొదలై అర్ధరాత్రి వరకూ సాగే బతుకమ్మ పాటలు పలారం, ముత్తయిదువలు ఒకరికొకరు అప్యాయంగా ఇచ్చిపుచ్చుకునే చీరలు, పలారం, చీరె, సారెలతో మహిళలు ఉత్సాహంగా గడుపుతారు. బతుకమ్మ పండుగను తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా భావిస్తారు.

ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లేలా దీవించాలని ఆడబిడ్డలు అమ్మవారిని పాటలతో కొలుస్తారు. అయితే, ప్రతీ ఏటా చిన్నాపెద్దా తేడా లేకుండా మహిళలంతా అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ సంబురాలకు ఈసారి ఆటంకాలు ఏర్పడ్డాయి. కొరోనా మహ్మమ్మారి కారణంగా మహిళలు ఒక్కచోట భారీ సంఖ్యలో గుమిగూడి ఆడుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకరి ద్వారా మరొకరికి సంక్రమించే గుణమున్న ఈ వైరస్‌ ‌సోకకుండా మహిళలు అత్యంత జాగ్రత్త వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. కొరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీనికితోడు గత మూడు రోజు రోజులుగా  కురుస్తున్న భారీ వర్షాలు  తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌మమానగరంలో బతుకమ్మ ఆడుకునేందుకు అనుకూలమైన పరిస్థితులు అసలే కనిపించడం లేదు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఏమాత్రం నిరుత్సాహానికి గురికాకుండా తమకు సాధ్యమైనంత మేరకు ఉత్సాహంగానే బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు.

Leave a Reply