Take a fresh look at your lifestyle.

పూల జాతర – బతుకమ్మ

“బొడ్డెమ్మ అంటే బొట్టె, బోడప, బోటిమ, పొట్టి అనే అర్ధాలు ఉన్నాయి. మొత్తానికి బొడ్డెమ్మ అంటే చిన్నదని అర్థం. బొడ్డెమ్మ అ అంటే ధాన్య రాశి, ధాన్యపు కుప్ప అని కూడా అంటారు. మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మహర్నవమి వరకు జరుపుకునే పండుగ బతుకమ్మ. పెళ్లి కావలసిన పిల్లలు బొడ్డెమ్మను ఆడితే…సుమంగళి భాగ్యం కోరుకునే ముత్తయిదువలు సద్దుల బతుకమ్మను పేర్చి జరుపుకునే పూర్తిస్థాయి మహిళల పండుగ. సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే, ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని ఇంత స్పష్టంగా చెప్పిన పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ స్త్రీల హృదయమే బతుకమ్మ. పుట్టింటి నుండి మెట్టినింటికి వెళ్లిన చిన్ననాటి జ్ఞాపకాలను కలకాలం పదిలంగా దాచిపెట్టి పండుగ బతుకమ్మ.”

తరతరాల ఆచారాలను ఒకరి నుండి ఒకరికి అందిస్తూ ఒక ప్రత్యేక సందర్భంలో చేసేవే పండుగలు. ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రత్యేకంగా అన్నింటికంటే పెద్ద పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రజల ఆశకు, యాసకు, భాషకు,మాండలికానికి బతుకమ్మ పాట వేదిక. ప్రకృతి శక్తిని ఆవిష్కరించే వేదిక భారతీయులంతా సాంప్రదాయ పూజ పద్ధతిలో దేవుళ్లను పూలతో పూజిస్తారు. కానీ నీ తెలంగాణ ప్రజలు మాత్రం పువ్వుల్లో నే దేవతను దర్శిస్తారు. ఇక్కడ పువ్వే దేవతా రూపం పొంది బతుకమ్మ అయింది. బతుకుఅమ్మా బతుకమ్మ, బ్రతుకు నిచ్చే అమ్మ గనుక బతుకమ్మ అయ్యింది. బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు ఒక దాని వెంట ఒకటి జరుపుకునే పండుగలు. భాద్రపద బహుళ పంచమి నుండి మహాలయ అమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు. బొడ్డెమ్మ అంటే బొట్టె, బోడప, బోటిమ, పొట్టి అనే అర్ధాలు ఉన్నాయి. మొత్తానికి బొడ్డెమ్మ అంటే చిన్నదని అర్థం. బొడ్డెమ్మ అ అంటే ధాన్య రాశి, ధాన్యపు కుప్ప అని కూడా అంటారు.
మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మహర్నవమి వరకు జరుపుకునే పండుగ బతుకమ్మ. పెళ్లి కావలసిన పిల్లలు బొడ్డెమ్మను ఆడితే…సుమంగళి భాగ్యం కోరుకునే ముత్తయిదువలు సద్దుల బతుకమ్మను పేర్చి జరుపుకునే పూర్తిస్థాయి మహిళల పండుగ. సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే, ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని ఇంత స్పష్టంగా చెప్పిన పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ స్త్రీల హృదయమే బతుకమ్మ. పుట్టింటి నుండి మెట్టినింటికి వెళ్లిన చిన్ననాటి జ్ఞాపకాలను కలకాలం పదిలంగా దాచిపెట్టి పండుగ బతుకమ్మ. బతుకమ్మ గురించి అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.

బతుకమ్మ నేపథ్యం:

telugu updates now, huzurabad by election counting, telagana bathukamma festivalచోళరాజు దంపతులైన ధర్మాంగుడు, సత్యవతి లకు నూరుమంది కొడుకులు. వారంతా యుద్ధంలో చనిపోయారు. దుఃఖంలో లో ఉన్న నా దంపతులు మళ్లీ సంతానం కావాలని లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారు. వారి ఇ వారి ఇ తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమైన ఏం వరం కావాలని అడుగగా ఆమెను తమ బిడ్డగా పుట్టమని కోరుకుంటుంది వారి కోరిక ప్రకారం లక్ష్మీదేవి వారి బిడ్డగా పుడుతుంది. ఆ సమయానికి అత్రి,వశిష్ట, కశ్యప, అంగీరస మహామునులు వచ్చి ఆ బిడ్డను ‘‘బతుకమ్మ’’ అని ఆశీర్వదిస్తారు. ఆ విధంగా లక్ష్మీదేవి బతుకమ్మగా పెరిగి పెద్దదై చక్రాంగుడనే పేరుతో మారువేషంలో వచ్చిన విష్ణుమూర్తిని పెళ్లాడుతుంది. కోరిన వారందరికీ సంతానం సిరిసంపదలను ప్రసాదిస్తూ అనేక వేల ఏండ్లుగా లక్ష్మీదేవియే బతుకమ్మగా పూజలందుకుంటుంది అని ఒక కథ ప్రచారంలో ఉంది.

మహిషాసురుని తో యుద్ధం చేసి అతన్ని చంపి అలసిపోయిన పార్వతీదేవి స్పృహ కోల్పోతుంది. ఆమె ప్రాణాలను కోల్పోతుందేమోనని స్తీలందరూ దేవిని చుట్టుముట్టి బతుకమ్మ….. బతుకమ్మ…. అని అని ప్రార్ధిస్తుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు స్పృహ కోల్పోయిన దేవి దశమి రోజున స్పృహలోకి వస్తుంది. ఆనాటినుండి పార్వతీదేవిని బతుకమ్మగా తొమ్మిది రోజులు పాటల్లో కీర్తిస్తూ పండుగ జరుపుకున్నట్లు ఒక కథ ప్రచారంలో ఉన్నది. ఒక కాపు రైతుకు ఒక కొడుకు ఆరుగురు బిడ్డలు పుట్టి చనిపోయారు. ఏడవ బిడ్డగా పుట్టిన బిడ్డను నీవైనా బతుకమ్మ…. బతుకు… అని అని పెద్దలు అందరూ ఆశీర్వదించారు. ఆమె పెరిగి పెద్దయిన తర్వాత ఒకరోజు తన వదిన ఆడపడుచులు చెరువుకు స్నానానికి వెళ్లారు, అక్కడ వారి బట్టలు ఒకరివి ఒకరికి తారుమారై పోతాయి. నా బట్టలు నీవెందుకు కట్టుకున్న వని వదిన ఆడపడుచును గొంతు నులిమి చంపి చెరువు గట్టున పాతి పెడుతుంది. ఎక్కడ వెతికినా బతుకమ్మ దొరకలేదు, తన తండ్రికి ఆమె కలలో కనిపించి వదిన తనను చంపి చెరువు గట్టున పాతి పెట్టిందని ఆమె తంగేడు చెట్టుగా వెలిసినా నని చెప్పింది. ఆమెను అను పాతిపెట్టిన ప్రదేశంలో తంగేడు చెట్టు మొలచి విరగబూసింది. తండ్రి దుఃఖాన్ని తీర్చడానికి తన పువ్వు తో ఆడపడుచులు బతుకమ్మను పేర్చి కొని ఆడుకోవాలని చెప్పింది. ఆమె కోరిక ప్రకారమే బతుకమ్మ వెలిసిందని ఒక ఐతిహ్యం.

యోధానుయోధులు అయినా ఏడుగురు అన్నదమ్ములకు ఒక్కగానొక్క చెల్లెలు, ప్రాణానికి ప్రాణంగా గా ఎంతో ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వదినలకు ఆమె అంటే కోపం. అన్నలు అంతా వేట కు పోయి చాలా రోజుల వరకు తిరిగి రాలేదు, వదినలు ఆడబిడ్డకు ఇంటి పనులు బయటి పనులు అన్నీ చెబుతూ వారికి లొంగి ఉండాలని భయపెట్టే వారు. ఈ బాధలన్నీ భరించలేక ఊరి చివర ఉన్న బావిలో పడి చనిపోతుంది. ఆ బావిలో ఆమె తామర పువ్వు గా ఉద్భవిస్తుంది, అన్నలు చెల్లెలి కోసం వెతికి వెతికి అలసిపోయి ఆ బావి వద్ద కూర్చొని చర్చించుకుంటారు. వారికి దాహం వేయగా బావిలోకి దిగి నీళ్లు తాగుదామని చూడగా వారికి పెద్ద తామర పువ్వు కనిపించింది, ఎన్నడూ లేనిది ఈ బావిలో ఈ తామర పువ్వు ఏమిటి?? అనుకునేలోపే అది అన్నలను చూసి ఇ ఒడ్డుకు వస్తుంది. పట్టుకోబోతే ఆ పువ్వు దూరం పోతుంది. ఇది ఇది మన చెల్లెలు కావచ్చు, మనలను చూసి కలుగుతుంది అని అనుకొని ఆ బావి గట్టున కూర్చొని ఉండగా, అప్పుడు అటు దిక్కు ఆరాజ్య మేలే రాజు నీళ్లు తాగుదామని మెట్ల ద్వారా ఆ బావి లోకి దిగుతాడు. ఆరాజును చూసి పువ్వు దగ్గరకు వస్తుంది. దాన్ని చేతులకు తీసుకొని చూసి తన రాజభవనాన్ని ఆనుకొని ఉన్న కొలను లో వేస్తాడు. అప్పుడు డు అక్కడున్న మిగతా తామరపూలతో మాట్లాడుతుంది. తనను తీసుకు పోను దేవుడు వస్తాడని, దేవుడే తనను వివాహం చేసుకుంటాడని చెప్తుంది. కొలను చుట్టూ తంగేడు చెట్లు ఉన్నాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి వస్తాడు తామర పువ్వు ను మనిషిగా చేసి ఆమెను వివాహమాడతాడు, ఆమె లక్ష్మీదేవి….. లక్ష్మీదేవియే గౌరమ్మ. రాజు కొలువులో వివాహమాడి దేవతా లోకానికి తీసుకుని పోతాడు. జానపదులు ఈ కథను యాది చేసుకుంటూ ప్రతి ఏడు దసరా పండుగకు ముందు తొమ్మిది రోజులు తంగేడు పువ్వు తో బతుకమ్మను పేర్చి ఆడుతూ…. పాడుతూ…. పూజలు చేస్తారు. ఇది ఇది జనంలో ఉన్న ప్రచారంలోని కథ.

సమస్త దేవతల సమాహార రూపమే ఆదిశక్తి అని నమ్మిన జానపదులు ఆమెను గౌరీదేవిగా, లక్ష్మీ గా, సరస్వతిగా, భావించి ప్రార్థిస్తారు. గౌరీ దేవి జానపదుల బతుకమ్మ లో పసుపు ముద్ద రూపంలో ‘‘పసుపు గౌరమ్మ’’ అయింది ప్రతి పూజ,ఆరాధనలో పసుపు కుంకుమలు స్త్రీల ప్రాణశక్తిని మరింత ఇనుమడింప చేస్తాయి. స్త్రీలంతా బతుకమ్మలతో చెరువు గట్టు మీద చేరి ఒకే రీతి కంఠస్వరంతో తమ తమ జీవితానుభవాలను అనుభూతులను పౌరాణిక గాధలను తాను విన్నా.. చూసిన సంఘటనలను పాటల్లో వర్ణిస్తూ లయబద్ధంగా పాడుతారు. ఇందులో శివపార్వతుల పాటలు రాముని కృష్ణుని పాటలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అత్తారింటికి వెళ్లే ఆడపిల్లలకు బతుకమ్మ పాటలు అత్తవారింట్లో మెలగవలసిన పద్ధతులను బోధించేవి గా ఉంటాయి. స్త్రీలు మాతృత్వాన్ని ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. సంతానం కోసం నోములు వ్రతాలు చేస్తారు. గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన ఆహార నియమాలు కూడా ఈ పాటల్లో వ్యక్తమవుతాయి.

Leave a Reply