Take a fresh look at your lifestyle.

వరదసాయాన్ని తక్షణమే నిలిపివేయండి

  • పదివేల సాయం ఆపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
  • రిజిస్రేషన్లు కూడా నిలిపివేయాలన్న ఈసి

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న వరద సాయాన్ని వెంటనే నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులోకి రావడంతో వరద సాయం పంపిణీతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వరద సాయాన్ని ఆపేయాలని, ఎన్నికల తర్వాత యథావిథిగా వరద సాయాన్ని కొనసాగించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో వరద సాయానికి బ్రేక్‌ ‌పడిన్లటైంది.
మంగళవారం నోటిఫికేషన్‌ ‌సందర్భంగా సాయం కొనసాగించవచ్చని చెప్పిన కమిషనర్‌ ఒక్క రోజులోనే నిలిపి వేయాలని ఆదేశించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి బాగా కలసి రానుంది. ఎన్నికల తరవాత అందచేస్తామని హావి• ఇచ్చే అవకాశం కలిగింది.

Leave a Reply