Take a fresh look at your lifestyle.

ఆల్మట్టికి మళ్లీ పోటెత్తిన వరద

‌ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఎపిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు  వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. రెండు రోజులు అక్కడే స్థిరంగా కొనసాగి, మరింత బలపడనుందని తెలిపింది.గత రెండురోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకులు పొంగిపొర్లుతున్నాయి.. దీంతో.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 33 అడుగుల దాటి ప్రవహిస్తుంది. ఇక, ఎగువన ఉన్న తాలిపేరు కిన్నెరసాని ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడంతో.. గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులు తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి పరిమాణం పెరుగుతుంది. గత రెండు రోజులుగా గోదావరిలో కూడా ప్రవాహ వేగం పెరిగింది. మరో రెండు మూడు అడుగులు పెరిగే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే భద్రాచలం సపంలో 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.. ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 53 అడుగులకు చేరుకుంటే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు .అప్పుడు
మాత్రమే ఈ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 29.6 అడుగులకు చేరింది. భద్రాచలం పుణ్యక్షేత్రం వద్ద స్నాన ఘట్టాలు నీట మునిగాయి. భద్రాచలం పట్టణంలో మంగళవారం రాత్రి నుంచి 12 గంటలపాటు ఏకధాటిగా 13.5 సెం..ల వర్షం కురిసింది. దీంతో.. గోదావరి కరకట్ట పక్కన అంబాసత్రం వద్ద ఉన్న చెరువు పొంగిపొర్లి.. ఆ నీరు రామాలయం పరిసర ప్రాంతాల వద్దకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల్లో జల్లులు కొనసాగాయి. అత్యధికంగా ఎర్రుపాలెంలో 2.4 సెం.. వర్షం కురిసింది. అశ్వాపురంలో ఇసుకవాగు పొంగి ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి.  ఇళ్లలోకి వరదనీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఓపెన్‌కాస్ట్ ‌గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
ఆల్మట్టికి పోటెత్తిన వరద
ఎగువన కురుస్తున్న వర్షాలతో  ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. బుధవారం సాయంత్రానికి 1,26,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో.. అక్కడి నుంచి నారాయణపూర్‌ ‌ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.  నారాయణపూర్‌ ‌నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 14 గేట్లు ఎత్తి 1,22,200 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు జూరాల ఇరిగేషన్‌ అధికారులకు సమాచారం అందడంతో.. వారు అప్రమత్తమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 57 గేట్లు ఎత్తి 4.30 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో కిన్నెరసానికి భారీగా వరదనీరు చేరుతోంది. ఈ జలాశయం సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 405 అడుగులకు చేరింది. దీంతో.. అధికారులు మంగళవారం రాత్రి 4 గేట్లుఎత్తి 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకోవడంతో 7 గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
సాగర్‌కు వరద ఉధృతి
నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ‌పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 563.10 అడుగులకు చేరింది. అలాగే ఇన్‌ప్లోలో 38,140 క్యూసెక్కులు, అవుట్‌ ‌ఫ్లో 8,422 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 239.6552 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
కోటిపల్లి వద్ద ప్రాణహిత ఉధృతి
లక్ష్మీబ్యారేజ్‌ ‌వద్ద పెరుగుతున్న ప్రవాహం
ఆదిలాబా• కోటపల్లి మండలాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నిం డుగా ప్రవహిస్తోంది. వర్షాలతో వాగులు, వంకలలోని వరద నీరు ప్రాణహిత నదిలో కలుస్తుండటంతో నది ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. అటు, ఇటు వైపులా ఒడ్లను తాకుతూ వరద పోటెత్తింది. వెంచపల్లి వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉండగా జనగామ, సూపాక, ఆల్గామా, పుల్లగామా, సిర్సా, అన్నా రం, అర్జునగుట్ట, రాపన్‌పల్లి గ్రామాల వద్ద ఒడ్లపాలెం వరకు వరద కొనసాగింది. దేవులవాడ వద్ద గోదావరి నదితో ప్రాణహిత ప్రవాహం కలిసి మరింత ఉధృతంగా పెరిగి లక్ష్మిబ్యారేజ్‌ ‌వైపు ప్రవాహం కొనసాగుతోంది. సిర్పూర్‌ ‌నియోజక వర్గంలోని పలు మండలాల్లో వాగులపై వంతెనలు పూర్తి కాకపోవడంతో ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగజ్‌నగర్‌-‌వాంకిడి మండలాలకు అనుసంధానంగా ఉండేందుకు అంకు సాపూర్‌ ‌వాగుపై 2013 సంవత్సరంలో రూ.1.50 కోట్లతో బ్రిడ్జి పనులు ప్రారంభించారు. కానీ బ్రిడ్జి నిర్మాణానికి ఆది నుంచి అవాంతరాలే ఎదుర వుతున్నాయి. దీంతో రెండేళ్లలో నిర్మించాల్సిన వంతెన  పనులు ఆరేళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. కాగజ్‌ ‌నగర్‌-అం‌కుసాపూర్‌-‌వాంకిడిని కలిసేందుకు ప్రత్యేక రోడ్డు సౌకర్యం కూడా పూర్తి చేశారు. నిధుల లేమి, కాంట్రాక్టర్‌ ‌నిర్లక్ష్యం ఫలితంగా ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి కావటం లేదు. బ్రిడ్జి పనులు కేవలం పిల్లర్ల స్థాయిలోనే మగ్గుతున్నాయి. 2018లో బ్రిడ్జి నిర్మాణ వ్యయాన్ని రూ.3కోట్లకు పెంచారు. వాస్తవంగా ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఆసిఫాబాద్‌తో సంబంధం లేకుండా నేరుగా కాగజ్‌నగర్‌ ‌నుంచి వాంకిడికి వెళ్లేందుకు ఆస్కారం ఉంది.  కానీ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఏటా ప్రయాణికులకు తిప్పలు తప్పటం లేదు. చిన్నపాటి వర్షం కురిసిందంటే అంకుసాపూర్‌ ‌వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచి పోతున్నాయి. కాగజ్‌నగర్‌-‌వాంకిడి మార్గాల్లో వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.  వర్షం కురిసిందంటే రాకపోకలు పూర్తిగా నిలిచి పోతాయి.  ఏటా ఇదే సమస్య పునరావృతం అవుతోంది. అధికారులు ముందస్తుగా స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌తో పనులు వేగవంతంగా అయ్యేట్టు చేస్తే బాగుంటుందన్నారు. కాగజ్‌నగర్‌-‌వాంకిడి మార్గంలో అంకుషాపూర్‌ ‌వంతెన ఉంది. ఈ వంతెనపై బ్రిడ్జి నిర్మాణం కోసం 2013లో నిధుల విడుదల చేశారు. ఇప్పటి నిర్మాణం పూర్తికాలేదు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ పూర్తి కావడం లేదు. నిధులు పెంచినా బ్రిడ్జి నిర్మాణంలో ఇంత వరకు పురోగతి లేదు. వర్షాకాలం వచ్చిదంటే పెద్దసిద్దాపూర్‌, ‌చిన్నసిద్దాపూర్‌, ‌కృష్ణపల్లి, సోమినితో పాటు మరో నాలుగు గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పటం లేదు. పెంచికల్‌పేటలోని ఎర్రగుంట వద్ద ఉత్సమల్లివాగుపై వంతెన లేకపోవటంతో  స్థాని కులు ఇబ్బందులు పడుతున్నారు. లోడ్‌పల్లి వద్ద బొక్కివాగుపై వంతెన లేకపోవటంతో వర్షాకాలంలో గొల్లగూడ వాసులు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. కాగజ్‌నగర్‌ ‌నుంచి భీమిని వెళ్లే మార్గంలో జగన్నాథ్‌పూర్‌ ‌గ్రామం సపంలోని వాగు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది.కాగజ్‌నగర్‌ ‌మండలం నారాపూర్‌లో ప్రధానంగా హైలెవల్‌ ‌వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ గ్రామానికి   ఒక్క బస్సు, ఆటో కూడా రాదు. ద్విచక్ర వాహనం పైనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్రామంలో 50 కుటుం బాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ గ్రామ పొలి మేరలోనే కుమరం భీం నుంచి పోయే నీటి కాల్వ ఉంటుంది. వర్షాకాలంలో ఈకాల్వలో మోకాలి లోతుతో ఎప్పటికీ నీరు ప్రవహిస్తుండటం వల్ల ఆటోలన్నీ గ్రామ పొలిమేర వరకే నడుస్తుంటాయి.
అయితే అర్ధరాత్రి ఎవరైనా అనారోగ్యంతో బాధపడి తే దేవుడిపైనే భారం వేసి బతుకాల్సిన పరిస్థితి ఉంది. కాగజ్‌నగర్‌కు సరిగ్గా 10కిలోటర్ల దూరం లోనే నారాపూర్‌ ‌గ్రామం ఉండడం గమనార్హం. అధికారులు ముందస్తుగా స్పందించి ప్రత్యేకంగా హై లెవల్‌ ‌వంతెన నిర్మాణం చేపట్టాలని నారాపూర్‌ ‌గ్రామస్థులు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!