Take a fresh look at your lifestyle.

నాలాలతో నగరానికి వరద ప్రమాదం?

  • నత్తనడకన పూడికతీత, కొత్త నిర్మాణ పనులు
  • ప్రజలకు వర్షాకాలంలో తప్పని తిప్పలు
  • నత్తనడకన కొనసాగుతున్న కొత్త నిర్మాణ పనుల దృశ్యం

గ్రేటర్‌ ‌వరంగల్‌కి వరద ముప్పు పొంచి ఉందా అంటే అవుననే అంటున్నాయి విపక్షాలు. కొరోనా బీజీలో పడి నాళాలను క్లియర్‌ ‌చేయడంలో జరిగిన ఆలస్యంతో శివారు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం తప్పదు అంటున్నారు జిల్లా ప్రజలు. గ్రేటర్‌ ‌వరంగల్‌కు వరద ముప్పు పొంచి ఉన్న అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌ ‌తరువాత అతి పెద్ద నగరమైన వరంగల్‌లో కొరోనా కాల్‌ ‌డౌన్‌కి తోడు గ్రేటర్‌ ‌వరంగల్‌లో కొరోనా కేసులు అధికంగా ఉండడంతో అధికారులంద రూ నివారణ చర్యల్లో బిజీగా ఉన్నారు. సుమారు రెండు నెలల పాటు అన్ని పనులు పక్కన పెట్టి కేవలం కొరోనా పైన అందరూ దృష్టి సారించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అధికారులు ఇప్పటి వరకు సరిగా దృష్టి సరించలేదని చెప్పవచ్చు. వర్షాకాలానికి ముందు నాళాల్లో ఉన్న పూడికతో పాటు పేరుకుపోయిన చెత్తును తొలగించాల్సిన ఉంది. కాని కొరోనా పనుల్లో పడ్డ అధికారులు నాళాల పైనా దృష్టి సరించలేదు. ఫలితంగా నాళాల్లో ఉన్న చెత్త అలాగే ఉండిపోయింది. దీంతో చిన్న పాటి వర్షం వచ్చినా డ్రైనేజీలు పొంగిపొర్లే అవకాశం ఉంది.

దీంతో సీజన్‌ ‌వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వర్షాకాలం రావడంతో రానున్న రోజుల్లో వర్షాలు జోరందుకుంటాయి. అయినా డ్రైనేజీలు, కాలువలు పెద్ద పెద్ద నాళాలు క్లిన్‌ ‌చేసే ప్రక్రియ వేగం పుంజుకోలేదు. తేలిక పాటి వానకే నగరం జలమయం అవుతుంది. రహదారులు చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. గతేడాది లొతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరం ముంపుకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలను అధికారులు ఇప్పటికి పూర్తి స్థాయిలో చేపట్టలేదని విమర్శలు ఉన్నాయి. వరంగల్‌ ‌నగరంలో 13 పెద్ద నాళాలు, వందకు పైన చిన్న కాలువల్లో జరుగుతున్న పనుల్లో వేగం లేదు. దీంతో ఒక్క గట్టి వర్ష కురవడంతో నాళాలను శుభ్రం చేసే పనులు ఆగిపోతాయి. దీంతో చిన్నపాటి వర్షానికి ఈసారి రోడ్లు జలమయం కావడం తప్పదని పలువురు పేర్కొంటున్నారు. మరో వైపు స్మార్ట్ ‌సిటీ పనుల్లోనూ చేపడుతున్న డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడంతో ఈ సారి నగరాన్ని వరద ముప్పు తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. హంటర్‌రోడ్‌ ‌బొందివాగు, భద్రకాళి, నయీంనగర్‌, ‌కరీమాబాద్‌, ‌సాకరాశికుంట, అండర్‌‌బ్రిడ్జి, శివనగర్‌, ‌కాజీపేట రామకృష్ణ కాలనీ, తుమ్మలకుంట, దేశాయిపేట వడ్డేపల్లి నాలాల్లో వ్యర్థాల పూడికతీత పనులు చేపట్టలేదు. కొన్నాళ్లుగా ఈ నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు వ్యర్థాలు, పిచ్చి చెట్లను తొలగించలేదు. నాలాల్లో వెలిసిన ఆక్రమణలకు తొడు చెత్త పెరుకపోయిన నేపథ్యంలో ఈసారి చిన్న వర్షానికి గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌ప్రజలకు వరద ముప్పు తప్పేలా లేదు. ఇప్పటికైనా అధికారులు నాళాలపై దృష్టి సారించాలని పలువురు వేడుకుంటున్నారు. కొరోనా సమయంలో అధికారులు శుభ్రతకు, నగరం వరద లేకుండా చూడాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం నాళాల పనులు జరుగుతున్నాయి. వర్షాలు పడే పడే సమయానికి శుభ్రం చేస్తామని అంటున్నారు.

Leave a Reply