Take a fresh look at your lifestyle.

వరద నష్టం 5వేల కోట్ల పైనే..

  • రూ.1,350 కోట్ల తక్షణ సాయం అందించండి
  • రాష్ట్రంలో వరద నష్టంపై ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్‌ ‌లేఖ

‌భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు వెల్లడించారు. ఈ మేరకు సాయం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ ‌ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. కాగా తక్షణ సహాయం, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ‌గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సవి•క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ఇప్పటికే తీసుకున్న సహాయక చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు.

Leave a Reply