Take a fresh look at your lifestyle.

ఆధిపత్య మృత భాషకు ప్రాణం పోస్తున్న పాలకులు

‘ప్రజలను చీల్చి ,వారి ప్రగతి కి అవరోధంగా ఉన్న ప్రాచీన విశ్వాసాలపై ,సంప్రదాయాలపై తిరుగుబాటు చేసి నవ ధర్మాన్ని ,నూతన వ్యవస్థను సంస్థాపించడానికి ప్రయత్నం చేసిన వారందరు సంస్కృతం పట్ల వ్యతిరేకతను చూపించారు .వైదిక ధర్మం పై తిరుగుబాటు చేసిన గౌతమ బుద్ధుడు తన శిష్యులను సంస్కృతంలో మాట్లాడవద్దు అని నిర్దేశించాడు. బసవేశ్వరుడు సంస్కృతంలో కాక కన్నడంలో రచనలు చేసాడు.పాలకుర్తి సోమన,వేమన లు తెలుగులో రచనలు చేశారు.కబీర్, నానక్ వంటి వారు సంస్కృతాన్ని పక్కకు నెట్టేసారు.సంస్కృత రామాయణంలో కూడా వాల్మీకి సీతమ్మతో హన్మంతుడు తన పరిచయాన్ని ప్రజల భాషలో చేసుకున్నాడని రాసాడు.హేతువాదాన్ని,జ్ఞాన పుట్టుకకు కారణమైన ప్రశ్నించే తత్వాన్ని ,అసమానతలను ధిక్కరించిన లోకాయత చార్వాకులు అణిచివేయడానికి కారణమైన సంస్కృత మనుస్మృతిని అంబేద్కర్ కాలబెట్టాడు.వైదిక పాలక వర్గం సంస్కృతం ను వివిధ జాతులు, సమూహాలు ,భిన్న సంస్కృతులు సృష్టించిన జ్ఞానాన్ని,తర్కాన్ని,బహుళత్వ స్పూర్తిని తొలగించడాని క్షీణింప చేయడానికి ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారు..’

అస్నాల శ్రీనివాస్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 9652275560

ఒక జాతి జవ జీవాలకు ,ఆత్మ గౌరవానికి భాషలు ప్రతీకగా ఉంటాయి.,జీవన విధానాలకు,చరిత్రకు,సాంస్కృతిక ధారలకు గవాక్షాలుగా ఉంటాయి.నూతన లేదా అన్య భాషలు నేర్చుకోవడం వలన అవి ఉద్భవించిన వాతావరణం,అక్కడి జీవన విలువలతో నూతన ఆలోచనలు, దృక్పథాలు ఏర్పడతాయి. ఇటీవల కేంద్రం ఆమోదించిన జాతీయ విద్యా కార్యక్రమంలో క్లాసికల్ భాషల అభివృద్ధి వికాసాలకు ప్రాధాన్యతను ఇచ్చింది.త్రిభాషా సూత్రం వెలుగులో సంస్కృతానికి పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలని ప్రస్తావించింది.సంస్కృతం లో ఉత్కృష్టమైన సాహిత్యం ,తత్వశాస్త్రం, వ్యాకరణం,వాస్తు,గణితం,సంగీతం ,వైద్యం లాంటి జ్ఞాన వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది. అనేక ఇతర భారతీయ ,ప్రపంచ భాషల వికాస మూలాలు సంస్కృతంలో ఉన్నాయని ఘోషించింది. పురాతన ఉన్నతమైన భారత జ్ఞాన సృష్టి,ఆలోచనల వారసత్వం నూతన విద్యా విధాన రూపకల్పన కు దీప స్థంభం లాగా పని చేసిందని చెపుతూ గత వైభవ చిహ్నంగా ,సంధాన ,వాహక భాషగా సంస్కృతం ఉంది కావున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని పాలసిలో చెప్పారు.

మహా గొప్పగా ఉన్నత పవిత్ర పదాలతో మన సంస్కృతికి ప్రతీకగా వివరించిన సంస్కృతం భాష నిర్వర్తించిన పాత్ర చరిత్ర గమనంలో భిన్నంగా ఉంది. విచిత్రకరమైన అంశం ఏమిటంటే భారత ఉప ఖండ చరితలో ప్రజల భాషగా ఎప్పుడు లేదు.ఏ ఒక నిర్దిష్ట ప్రాంత ప్రజలు కూడా ఈ భాష మాట్లాడలేదు.జన భాషగా మనుగడ లేని కేవలం 0.001 %ప్రజలు మాట్లాడే సంస్కృతానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం విస్మయానికి లోను చేస్తుంది.ఒక వర్ణానికి పరిమతమయ్యి దేవభాష గా చలామణి లో ఉంది.పరిపాలనలో పండితుల మధ్య సమాచార మార్పిడి కోసమే ఉపయోగపడిన భాష.భారతీయ వర్గ కుల సమాజ పటిష్టత కు దోహదం చేసిన భాషగా ,పురోహిత శ్లోక భాషగా మాత్రమే నమోదు కాబడింది.ప్రజలను చీల్చి ,వారి ప్రగతి కి అవరోధంగా ఉన్న ప్రాచీన విశ్వాసాలపై ,సంప్రదాయాలపై తిరుగుబాటు చేసి నవ ధర్మాన్ని ,నూతన వ్యవస్థను సంస్థాపించడానికి ప్రయత్నం చేసిన వారందరు సంస్కృతం పట్ల వ్యతిరేకతను చూపించారు .వైదిక ధర్మం పై తిరుగుబాటు చేసిన గౌతమ బుద్ధుడు తన శిష్యులను సంస్కృతంలో మాట్లాడవద్దు అని నిర్దేశించాడు. బసవేశ్వరుడు సంస్కృతంలో కాక కన్నడంలో రచనలు చేసాడు.పాలకుర్తి సోమన,వేమన లు తెలుగులో రచనలు చేశారు.కబీర్, నానక్ వంటి వారు సంస్కృతాన్ని పక్కకు నెట్టేసారు.సంస్కృత రామాయణంలో కూడా వాల్మీకి సీతమ్మతో హన్మంతుడు తన పరిచయాన్ని ప్రజల భాషలో చేసుకున్నాడని రాసాడు.హేతువాదాన్ని,జ్ఞాన పుట్టుకకు కారణమైన ప్రశ్నించే తత్వాన్ని ,అసమానతలను ధిక్కరించిన లోకాయత చార్వాకులు అణిచివేయడానికి కారణమైన సంస్కృత మనుస్మృతిని అంబేద్కర్ కాలబెట్టాడు.వైదిక పాలక వర్గం సంస్కృతం ను వివిధ జాతులు, సమూహాలు ,భిన్న సంస్కృతులు సృష్టించిన జ్ఞానాన్ని,తర్కాన్ని,బహుళత్వ స్పూర్తిని తొలగించడాని క్షీణింప చేయడానికి ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారు.

వివేకానందుడు ఒకానొక సందర్భంలో చాందసవాదులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యానం”మీ కలుగులలో నుంచి వెలికిరండి, ఒక సారి నలుదిక్కులకు చూడండి,దేశ దేశాలు శాస్త్ర సాంకేతిక రంగంలో ఎలా పురోగమిస్తున్నాయో చూడండి.శతాబ్దాల తరబడి పేరుకుపోయిన గుడ్డి నమ్మకాల నుండి మీరు పుట్టుకొచ్చారు.హేతువు లోపించిన మెదళ్ళతో,వికాసం లేని హృదయాలతో, ప్రజా హింస నుండి పుట్టుకొచ్చి ప్రగతి విరోధులుగా మారుతున్నారు.మీరు మారక పోతే మీ హింసను అనుభవిస్తున్న వర్గాలు మిమ్మలని, మీ మూఢత్వ, ఆధిపత్య భావాలను కూకటి వేళ్ళతో పెరికి వేస్తారు.ఇప్పుడు వివేకుడి మాట ఆచరణగా మలచడానికి మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది.

2014 మోడీ అధికారంలోకి వచ్చాక హిందీ భాషేతర ప్రాంతాలను లొంగతీసుకోవటానికి సంస్కృతానికి విస్తృత ప్రచారం కలిగిస్తున్నాడు. సంస్కృతం తో పాటు ఇతర ప్రాచీన భాషల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని ప్రకటించాడు.కానీ గడిచిన ఆరేళ్ళ ఆచరణలో పురాతనమైన, అపూర్వ సాహిత్యం సృజించబడిన,ప్రజల ఉద్వేగాలకు సంస్కృతులకు ప్రతీకలుగా కొనసాగుతున్న తమిళం,తెలుగు, కన్నడ, మలయాళం,ఒడియా. మొదలగు భాషల అభివృద్ది కి కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి.భారతీయ,పర్షియన్ భాషలతో జీవం పోసుకున్న ఉర్దూ భాషను పూర్తిగా విస్మరించారు. సంస్కృతానికి రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ స్థాపించి 650 కోట్లను కేటాయించారు.ఈ దేశ మూలవాసుల,బహుజనుల,శ్రామికవర్గ ప్రజల భాషల పట్ల తీవ్రనిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ప్రజల అభివృద్ధి ఎజెండా లేని అప్రజాస్వామిక పాలకులు “పాలిన్ జెనెటిక్ అతి జాతీయవాద రాజకీయాలు “చేస్తారని బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్త రోజర్ గ్రిఫిన్ సూత్రీకరించాడు. ఈ భావన వెలుగులోనే ప్రాచీన విశ్వాసాలను గొప్పవని,గతంలో మనుగడలో ఉన్న సామాజిక వ్యవస్థలు స్వర్ణ యుగాలని,వాటిని పునరుద్ధరణలోనే మంచి భవిష్యత్ ఉంటుందని అనేక కట్టు కల్పిత కథలను ప్రచారం చేసి పాత సామాజిక అంతరాల క్రమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.అప్పడాలు తింటే కరోనా తగ్గుతుందనే సంఘ పరివార్ బృంద సూడో సైన్స్ ప్రచారాలతో అంతర్జాతీయ సమాజం ముందు అభాసు పాలైన మన కేంద్ర పాలకులు,వారి వంత పాడే పరిపక్వత, జ్ఞాన లేమి,తర్క లేమి మేధావులు మరింతగా తెగబడి అణచివేత కు సాధనంగా ఉపయోగపడిన సంస్కృతాన్ని పొగడుతున్నారు.సంస్కృత అధ్యయనం వలన ప్రపంచ సమస్యలు పరిష్కారం అవుతాయని,తప్పులు లేకుండా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయవచ్చని ,వాతావరణ మార్పు సమస్యలు తొలగిపోతాయని వంటి హస్యాస్పద ప్రచారాన్ని సీరియస్ గా చేస్తున్నారు.2050 నాటికి అంతర్జాతీయ భాష గా మారి ప్రపంచాన్ని శాసిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి సెలవిస్తున్నారు.

నేటి యూరోపియన్ సాంస్కృతిక మరియు సైన్స్ సాంకేతిక శాస్త్రాలలో గ్రీక్ ,లాటిన్ భాషలకు స్థానం ఉన్నట్లే మన సాంస్కృతిక జీవితంలో సైతం నిస్సందేహంగా స్థానం ఉంది.అయితే అది పరిమిత స్థానం .కొందరు పండితులు ,పరిశోధకులు, రచయితలు ,మంత్ర తంత్రాలను వృత్తిగా చేసుకున్న వారు మాత్రమే నేర్చుకోవాల్సిన భాష.ఇతరులు దాని వల్ల ప్రయోజనం పొందలేరు.పైగా ఆ భాష వల్ల ప్రజలు చాందసులుగా ,వ్యర్థులుగా మారే అవకాశముంది.మోడీ ప్రభుత్వానికి సంస్కృతం పట్ల ప్రత్యేక రాజకీయ ఆసక్తులు వలన విధిగా అభ్యసించాలనే శాసనము చేసే అవకాశముంది.ఇప్పటికే వీరు పాలనలో ఉన్న ఉత్తరఖండ్ లో తప్పనిసరి చేశారు.వీరు పాలనలో ఉన్న అనేక రాష్ట్రాలలో సంస్కృత గ్రామాలను నిర్మిస్తున్నారు.ఇదే దేశ వ్యాప్తంగా కొనసాగితే లక్షలాది విద్యార్థుల జీవితాలను,భవిష్యత్ ను బుగ్గిపాలు అవడం అనివార్యమవుతుంది.

గౌతమ బుద్ధుని కాలంలోనే ప్రజా సామాన్యానికి మృత భాషగా పరిణమించిన దాని పునరుద్ధరణ ప్రచారాన్ని ,నిధుల వృధాను వ్యతిరేకించాలి..ఎంతో మంది ప్రజా సాహితీ వేత్తలు,సంస్కర్తలు కృషితో దోపిడి అణచివేతల భాషగా ఉన్న సంస్కృతానికి ప్రత్యమ్నాయంగా అనేక భారతీయ ప్రజా భాషలను గత వెయ్యి సంవత్సరాలు గా వికాసం చెందుతూ అపార జ్ఞాన సాహిత్య సాంస్కృతిక వ్యవస్థలను సృష్టించాయి.వీటి వికాసానికి అవరోధం కలిగిస్తున్న చీకటి శక్తులను నిలువరించడం ప్రజాస్వామిక వాదుల ,విద్యా వంతుల తక్షణ కర్తవ్యం కావాలి.తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం ప్రజలకు కర్మ సిద్దాంతంను బోధించే జ్యోతిష్యం, దైవిక మనుషులు,ఇతర వాస్తు మూఢ విశ్వసాలను పాఠాలుగా చెప్తున్నారు. ఇదే కొనసాగి వ్యవస్థీకృతం అవుతే ప్రజల స్వేచ్చా స్వాతంత్రాలకు భంగము కలుగుతుంది,బహుళ సంస్కృతుల ప్రజాస్వామ్య స్పూర్తి దెబ్బతింటుంది.

వివేకానందుడు ఒకానొక సందర్భంలో చాందసవాదులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యానం”మీ కలుగులలో నుంచి వెలికిరండి, ఒక సారి నలుదిక్కులకు చూడండి,దేశ దేశాలు శాస్త్ర సాంకేతిక రంగంలో ఎలా పురోగమిస్తున్నాయో చూడండి.శతాబ్దాల తరబడి పేరుకుపోయిన గుడ్డి నమ్మకాల నుండి మీరు పుట్టుకొచ్చారు.హేతువు లోపించిన మెదళ్ళతో,వికాసం లేని హృదయాలతో, ప్రజా హింస నుండి పుట్టుకొచ్చి ప్రగతి విరోధులుగా మారుతున్నారు. మీరు మారక పోతే మీ హింసను అనుభవిస్తున్న వర్గాలు మిమ్మలని, మీ మూఢత్వ, ఆధిపత్య భావాలను కూకటి వేళ్ళతో పెరికి వేస్తారు.ఇప్పుడు వివేకుడి మాట ఆచరణగా మలచడానికి మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది.

Leave a Reply