Take a fresh look at your lifestyle.

ఇక విమానాల్లో కేబిన్ బ్యాగేజ్ లేనట్టే ..?

కోవిద్  19 సంక్షోభం కారణంగా మార్చ్ 25 నుంచి నిలిచిపోయిన విమాన సర్వీసులను త్వరలో ప్రారంభించే ప్రణాళిక సిద్దమవుతుంది . ఇందుకు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కసరత్తు ప్రారంభించింది . కమర్షియల్ ఫ్లయిట్ లలో ప్రయాణించే వారి నుంచి  ఒక ప్రశ్న పత్రం లో  నిబంధనలను అంగీకరించిన వారిని ప్రయాణానికి అనుమతిస్తారు .కేబిన్ బాగేజ్ కు అనుమతి ఇవ్వక పోవచ్చని తెలుస్తుంది . రెండు గంటల ముందే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది .  మొబైల్ లో ఆరోగ్య సేతు ఆప్ లేని ప్రయాణికులకు అనుమతి ఉండదు .

 

ఈ  నిబంధనలు ప్రయాణికులకు కాకుండా విమాన సిబ్బందికి . ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ సిబ్బందికి కూడా వర్తిస్తుంది .మధ్య సీటు ఖాలీ ఉంచడం పై ఇంకా నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తుంది .ప్రయాణికులు ప్రయాణానికి నెల రోజుల్లో ఎప్పుడయినా క్వారంటైన్ లో ఉంటె వారిని ఐసోలేషన్ సెక్యూరిటీ కి పంపుతారని తెలుస్తుంది .

Leave a Reply