Take a fresh look at your lifestyle.

కాశ్మీర్‌లో ఆకస్మిక వరదలతో అతలాకుతలం

వరదల్లో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు
శ్రీనగర్‌, ఆగస్ట్ 1 : ‌జమ్మూకశ్మీరులో గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలతో ఆకస్మిక వరదలు వెల్లువెత్తాయి. అతి భారీవర్షాల వల్ల పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. కథువా జిల్లాలో సంభవించిన మెరుపు వరదల వల్ల ముగ్గురు కొట్టుకుపోయారు. సల్లాన్‌ ‌ప్రాంతానికి చెందిన దేవ్‌ ‌రాజ్‌, ‌బబ్లూ, కమల్‌ ‌సింగ్‌ ‌లు వరదనీటిలో కొట్టుకుపోయారని జమ్మూకశ్మీర్‌ అధికారులు చెప్పారు.

శ్రీనగర్‌, ‌బుద్గాం, గండేర్‌ ‌బల్‌ ఉత్తర, దక్షిణ కశ్మీరు ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జమ్మూకశ్మీరులో భారతవాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది.

పూంచ్‌ ‌జిల్లా సురాన్‌ ‌కోట్‌ ‌తహసీల్‌ ‌పరిధిలో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల పలు వాహనాలు కొట్టుకుపోయాయి. జమ్మూకశ్మీర్‌ ‌పోలీసులు, భారత సైనికులు సహాయ పునరావాస పనులు చేపట్టారు. కథువా జిల్లా బిల్వారా తహసీల్‌ ‌లో భారీవర్షాల వల్ల ఓ ఇల్లు కూలి ఇద్దరు మరణించారు.జోజిలా పాస్‌ ‌వద్ద వరదనీరు రావడంతో శ్రీనగర్‌-‌లేహ్‌ ‌జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Leave a Reply