Take a fresh look at your lifestyle.

ఐదు బల పరీక్షల్లో నెగ్గిన .. అపర చాణుక్యుడు పి.వి!

“సోనియాగాంధీ సలహా మేరకు ‘‘ఏకగ్రీవ నిర్ణయం’’ పద్ధతి ప్రకారము పి.వి పార్లమెంటరీ పార్టీ నాయకునిగా నిర్ణయించబడి ఎన్నిక కాబడి దేశం సంకట, సంక్షోభ స్థితిలో ఉన్న సమయంలో దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి పాములపర్తి వెంకట నరసింహరావు (పి.వి) జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీకి అధ్యక్షునిగా మే 29, 1991న బాధ్యతలను తీసుకోవడంతో పాటు, పార్లమెంట్‌లో మైనార్టీ ఉన్నప్పటికిని ప్రధానమంత్రి పదవీబాధ్యతలను 21 జూన్‌ 1991 ‌నుండి చేపట్టడడమేకాక ఐదు సార్లు బల పరీక్షలు నెగ్గి ఎటువంటి అస్థిరత లేకుండా ఆ పదవిలో కొనసాగడం అతని సాహసానికి నిదర్శనం.”

దేశంలో అస్థిరత, ఆందోళనలు, ఉద్యమాలు, సమస్యలు, ఆర్థిక సంక్షోభంతో ఉన్న సమయంలో 1991లో ఎన్నికలు వచ్చాయి. అట్టి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, పాములపర్తి వెంకట నరసింహరావు దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. శ్రీపెరుంబుదూర్‌లో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారములో భాగంగా ప్రసంగించడానికి వేదిక వద్దకువెళ్తుండగా ఆనాటి కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడైన రాజీవ్‌గాంధీ శ్రీలంక ఎల్‌.‌టి.టి.ఈ సంస్థ ప్రయోగించిన మానవబాంబుతో హత్యకుగురయ్యాడు. ఆ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. రాజీవ్‌గాంధీ హత్యానంతరము రెండు విడుతల ఎన్నికలు జరిగి ఎన్నికల ఫలితాలు వెలుబడినాయి. 521 స్థానాలలో జరిగిన ఎన్నికల ఫలితా)లో కాంగ్రెస్‌పార్టీకి 232, కాంగ్రెస్‌ ‌మిత్ర పక్షాలు 18స్థానాలు గెలుచుకోగా ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు. పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ ‌పార్టీ నిలిచింది. రాష్ట్రపతి నుండి కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి పిలుపు వచ్చింది. పార్లమెంటరీ పార్టీ నాయకులే ప్రధాని అవుతారు కనుక దానికోసం అర్జున్‌సింగ్‌, ‌శరద్‌పవార్‌లు పోటిపడుతున్న సందర్భంలో, తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పి.వి అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. సోనియాగాంధీ సలహా మేరకు ‘‘ఏకగ్రీవ నిర్ణయం’’ పద్ధతి ప్రకారము పి.వి పార్లమెంటరీ పార్టీ నాయకునిగా నిర్ణయించబడి ఎన్నిక కాబడి దేశం సంకట, సంక్షోభ స్థితిలో ఉన్న సమయంలో దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి పాములపర్తి వెంకట నరసింహరావు (పి.వి) జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీకి అధ్యక్షునిగా మే 29, 1991న బాధ్యతలను తీసుకోవడంతో పాటు, పార్లమెంట్‌లో మైనార్టీ ఉన్నప్పటికిని ప్రధానమంత్రి పదవీబాధ్యతలను 21 జూన్‌ 1991 ‌నుండి చేపట్టడడమేకాక ఐదు సార్లు బల పరీక్షలు నెగ్గి ఎటువంటి అస్థిరత లేకుండా ఆ పదవిలో కొనసాగడం అతని సాహసానికి నిదర్శనం.

ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారము చేసి మంత్రి మండలిని ఏర్పాటు చేసి పాలలను చేబట్టి రాష్ట్రపతి పార్లమెంట్‌లో ఉపన్యసించిన తర్వాత ఆనవాయితీగా ధన్యవాదాలు తెలుపాలి. పి.వి. ప్రభుత్వం మైనార్టీలో ఉంది కాబట్టి దానిని ప్రతి పక్షాలు ఆయుధంగా ఉపయోగించుకొని ప్రతి పక్ష పార్టీలు పార్లమెంటులో 15.07.1991 రోజున అవిశ్వాసం ప్రవేశపెట్టగా, తన కంటే ముందుగా ప్రధానమంత్రులుగా పని చేసిన వి.పి.సింగ్‌ ‌గారు, చంద్రశేఖర్‌ ‌గారు ఒకప్పటి కాంగ్రెస్‌ ‌నాయకులైనందున వారితో కలిసి పనిచేసినందున విస్త్రత సంబంధాలను కల్గియున్నారు. వారి మద్ధతును కూడగట్టినారు. 16.07.1992 రోజున మొదటి బలపరీక్షను ఎదుర్కోగా పి.వి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బి.జె.పి పార్టీ వారు ఓటువేసినారు. వామపక్ష పార్టీలు విశ్వాస పరీక్షలో పాల్గొనలేదు. దానితో విశ్వాస తీర్మాణములో సానుకూలంగా 241 ఓట్లు, వ్యతిరేకంగా 111 ఓట్లతో అవిశ్వాస తీర్మాణము వీగిపోయింది. మార్చి 9, 1992 రోజున రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలుపవలసిన సమయంలో వామపక్ష సభ్యులు ఆర్థిక సంక్షోభంలోని తీవ్రత గురించి వివరిస్తూ ఐ.యం.ఎఫ్‌కు ప్రభుత్వము అమ్ముడుపోయిందని అభియోగంతో సంఖ్యాలబలము లేని కారణంగా బలపరీక్షగా మారింది. బలపరీక్షలో ఓడిపోతే ప్రధానమంత్రిగా పి.వి. రాజీనామా చేయవలసి ఉంటుంది. ఆ సమయంలో జనతాదళ్‌ ‌పార్టీ నుంచి అజిత్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఏడుగురు యం.పిలు, తెలుగుదేశము పార్టీ నుండి తొమ్మిది మంది యం.పిలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. పి.వి. రెండవసారి బలపరీక్షలోనెగ్గారు.

పి.వి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని, ముఖ్యంగా వ్యాపార రంగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ సంక్షేమము పేరుమీద జరిగే ఖర్చులను తగ్గించాలని, ఆర్థిక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలుగా ఉన్నాయని జూన్‌ 30, 1992 ‌రోజున నేషనల్‌ ‌పార్టీ, వామపక్షాలు కలిసి అవిశ్వాస తీర్మాణాన్ని తీసు•• రావాలని నిర్ణయించినారు. బి.జె.పి పార్టీ కూడా అవిశ్వాస తీర్మాణానికి మద్ధతును తెలిపినాయి. జూలై 17, 1992 రోజున పార్లమెంట్‌లో పి.వి అవిశ్వాస తీర్మాణమును ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎ.ఐ.డి.యం.కె పార్టీ అధినేత జయలలిత, తెలుగుదేశం పార్టీలోని ఆరుగురు యం.పిలు, అజిత్‌ ‌సింగ్‌ ‌వర్గం నలుగురు యం.పిలు అధికంగా ఓట్లువేసినారు. అవిశ్వాస తీర్మాణానికి వ్యతిరేకంగా 52 ఓట్లు అధికంగా రావడంతో ముచ్చటగా మూడోసారి అవిశ్వాసం వీగిపోయింది. డిసెంబర్‌ 6, 1992 ‌రోజున బాబ్రీ మసీదును కూల్చివేసిన కారణంగా ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలనను విధించి మసీదును కాపాడవలసిందని 21.12.1992 రోజున ప్రభుత్వముపై అవిశ్వాస తీర్మాణమును ప్రవేశపెట్టినారు. అవిశ్వాసము గెలిస్తే బి.జె.పి లాభపడుతుందని భావించి కాంగ్రెస్‌ ‌పార్టీకి అనుకూలంగా 334 విశ్వాస తీర్మాణానికి వ్యతిరేకంగా 103 ఓట్లు రావడముతో నాలుగవసారి అవిశ్వాసము వీగిపోయింది.

జూన్‌ 16, 1993 ‌రోజున హర్షిద్‌ ‌మెహతా జైలు నుండి బెయిలుపై బయటకు వచ్చి పత్రికా విలేకరుల సమావేశములో కేంద్రప్రభుత్వానికి రాజకీయ మద్ధతును కూడగట్టటానికి ప్రధాన మంత్రికి కోటి రూపాయలు ఇచ్చినానని ప్రకటించినారు. భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు ప్రధానమంత్రిగా పదివికి రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ పార్లమెంటులో అవిశ్వాస తీర్మాణమును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించినారు. నేషనల్‌ ‌ఫ్రంట్‌, ‌బహుజన సమాజ్‌వాది పార్టీలు మద్ధతును తెలిపినాయి. దానితో ప్రధాన మంత్రికి చిక్కు సమస్యగా మారింది. జూలై 28, 1993 రోజున అవిశ్వాస తీర్మాణమును ప్రవేశపెట్టినారు. పార్లమెంట్‌లో మొదటగా అర్జున్‌సింగ్‌ ‌మాట్లాడినారు. ఆ తర్వాత పి.వి. మాట్లాడి ఆవేశంగా పార్లమెంట్‌నుండి బయటకు వెళ్ళిపోయినారు. అందరూ అదే పి.వికి ఆఖరి ఉపన్యాసమని అనుకున్నారు. తర్వాత ఓటింగ్‌ ‌జరిగింది. అజిత్‌సింగ్‌ ‌వర్గం, ఝార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా పార్టీకి చెందిన నలుగురు యం.పిలు, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా, అనుకూలంగా 265 వ్యతిరేకంగా 251 ఓట్లు రావడముతో ఐదవసారి అవిశ్వాస తీర్మాణము వీగిపోయింది. దీనితో మల్లి ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాణమును ప్రవే• •పెట్టలేదు. ఈ విధంగా పి.వి. ఐదుసార్లు బలపరీక్షను ఎదుర్కొని పూర్తికాలముగా ప్రధానమంత్రిగా ఎటువంటి అస్థిరత లేకుండా ప్రధానమంత్రి కొనసాగి అపరచాణుక్యుడని పించు కున్నాడు! అటువంటి అపరచా ణుక్యుడు తెలంగాణ వాడు మనం గరించదగ్గ విషయం. 28 జూన్‌ ‌నుండి పి.వి శత జయంతి ఉత్సవా లను నిర్వహించడానికి ముందు కురావడం చాలా సముచితం కూడా!.

Doctor Erukonda Narasimha
డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడు, గౌరవ సలహదారు దొడ్డి కొమురయ్య ఫౌండేషన్‌.

Leave a Reply