Take a fresh look at your lifestyle.

ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు

  • ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌ఫలితాలపై  సర్వత్రా ఆసక్తి
  • బెంగాల్లో తమదే అధికారం అన్న ధీమాలో బిజెపి

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బిజెపిలో ఆసక్తి కలుగుతోంది. బెంగాల్లో పాగా వేస్తామని ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్‌ ‌షాలు ధీమాగా ఉన్నారు. అసోంలో తిరిగి అధికారం మాదే అని కూడా అంటున్నారు. బెంగాల్లో విజయంపై బిజెపి రాష్ట్ర శాఖ కూడా ఆశాజనకంగానే ఉంది. అయితే ఆదివారం జరిగే కౌంటింగ్‌పై బిజెపి శ్రేణులు ఆసక్తిగా చూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా పార్టీ ప్రధాన కార్యాలయంలో భారీగా ఏర్పాట్లు చేశారు. విజయోత్సవాలపై ఇసి నిషేధం విధించిన దరిమిలా జాగత్తలు తీసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి షాక్‌ ‌తప్పదని ఎగ్జిట్‌ ‌పోల్స్ ఇప్పటికే ప్రకటించాయి.  అసోం మినహా ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి అధికారం దక్కే అవకాశాలు లేవంటున్నాయి ఎగ్జిట్‌ ‌పోల్స్.. ఇక, అన్ని రాష్ట్రాలఎన్నికలు ఓ ఎత్తు.. బెంగాల్‌ ఓ ఎత్తు అన్నట్టుగా ప్రచారం సాగినా.. అక్కడ కమలనాథుల ఆశలు నెరవేరయని.. మరోసారి దీదీయే సీఎం చైర్‌ ఎక్కడం ఖాయం అంటున్నాయి. అయితే ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌ఫలితాల అంచానలు తప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరోవైపు.. తమిళనాడులో డీఎంకే.. దాని మిత్రపక్షాలు క్లీన్‌ ‌స్వీప్‌ ‌చేయనుండగా.

కేరళలో మరోసారి కామ్రేడ్లదే (ఎల్డీఎఫ్‌) అధికారం అని స్పష్టం చేస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది విడతలుగా పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్‌ ‌నిర్వహించింది  జాతీయ ఛానెల్స్.. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ, షా, బీజేపీ అగ్రనాయత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసి కొట్టలా కనిపిస్తున్నాయని తేల్చాయి.  బెంగాల్లో 294 స్థానాలకు గాను తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ 152-164 ‌స్థానాల్లో విజయం సాధించనుండగా.. బీజేపీ 109-121 స్థానాలకే పరిమితం కానుంది.. వామపక్షాలు, ఇతరులు మరో 11-21 స్థానాలు గెలుచుకుంటారని ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌తేల్చేశాయి.. ఇక ఎన్డీటీవీ ప్రకారం.. టీఎంసీకి 156 స్థానాలు వస్తే.. రిపబ్లిక్‌-‌సీఎన్‌ఎక్స్ ‌ప్రకారం 126-136 సీట్లు సాధించనుంది. ఇక, బీజేపీ 138-148 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే, జన్‌కీ బాత్‌, ‌రిపబ్లిక్‌ ‌సీఎన్‌ఎక్స్ ‌మాత్రం బీజేపీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టింది. మరోవైపు.. అసోంలో భారతీయ జనతా పార్టీదే అధికారం అంటున్నాయి. ఎన్డీటీవీ ప్రకారం మొత్తం 126 స్థానాల్లో బీజేపీకి 76 స్థానాలు దక్కనుండగా.. ఇండియా టుడే, ఆజ్‌తక్‌-‌యాక్సిస్‌ ఎగ్జిట్‌ ‌పోల్స్ .. ‌బీజేపీకి 75-85 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. కేరళలో మరోసారి వామపక్ష కూటమిదే అధికారం అంటున్నాయి ఎగ్జిట్‌ ‌పోల్స్. . ‌కేరళలో మొత్తం 140 స్థానాలకు గాను ఎల్డీఎఫ్‌ ‌కూటమికి 104-120 స్థానాలు వస్తాయని అంచనా వేసాయి. అయితే ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు ఇసి అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం లోగా పూర్తి ఫలితాలు వచ్చే అవకావం ఉంది. విజయోత్సవాలపై ఇసి వేటువేయడంతో ఇక ర్యాలీలు, విజయోత్సవాలకు అవకాశం లేదు.

Leave a Reply