Take a fresh look at your lifestyle.

గోదావరిలో ఐదుగురు గల్లంతు

  • గోదావరిలో ఐదుగురు గల్లంతు
  • ముగ్గురు దుర్మరణం…ఇద్దరు సురక్షితం
  • శోక సంద్రంలో కుటుంంబ సభ్యులు, బంధువులు

భద్రాచలం, మార్చి 19 (ప్రజాతంత్ర ప్రతినిధి) : భద్రాచలంలో శుక్రవారం గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు దుర్మరణం పాలు కాగా ఇద్దరు మాత్రం సురక్షితంగా బయటపడి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక అయ్యప్ప కాలనీలో జరిగిన వేడుకకు హాజరైన వీరంతా బంధువులతో కలిసి గోదావరిలో స్నానానికి వెళ్లారు. మృతులు వెలిదండి వరలక్ష్మీ(28), కొండవలస సురేఖ(14), సొంతపూరి రాంచరణ్‍(8), చికిత్స పొందుతున్న సొంతపూరి భవానీ, వెలిదండి వీరబాబులు మిషన్భతగీరథ ఇన్టేకక్‍ వెల్ సమీపంలో స్నానానికి దిగారు. స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వీరు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానికంగా ఉన్న వారు వీరిని గుర్తించి వెంటనే నదిలోకి దూకి కొందరిని బయటకు లాగారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి రక్షించి బయటకు తీసిన కొండవలస సురేఖ, సొంతపూరి భవానీ, వెలిదండి వీరబాబులను అంబులెన్స్ ల ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మార్గంలోనే సురేఖ(14) చనిపోయింది. రాంచరణ్‍(8) తొలుత నదీ ప్రవాహానికి కొట్టుకుపోతుండగా మిగిలిన వారంతా కాపాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఐదుగురూ ప్రమాదానికి గురయ్యారు.

ఫంక్షన్ కు వచ్చి…!
ఇటీవల రెండు రోజుల క్రితం అయ్యప్పకాలనీలో ఒక ఫంక్షన్కుర తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి కొండవలస సురేఖ, వెలిదండి వీరబాబులు వచ్చారు. ఫంక్షన్‍ అయ్యాక తిరిగి వెళ్లిపోదామనుకుంటే శుక్రవారం సెంటిమెంట్‍ కారణంగా బంధువులు వెళ్లనీయలేదు. దీనితో వీరంతా సరదాగా గోదావరి స్నానానికి వెళ్లారు. గోదావరి రూపంలో విధి వీరిని బలి తీసుకుంది. జరిగిన సంఘటనతో బంధువులంతా షాక్కుా గురయ్యారు. ఫంక్షన్ కు వచ్చిన వారిని గంగమ్మ మింగేసిందంటూ వారు భోరున రోదిస్తున్నారు. బంధువుల రోదనలతో గోదావరి ప్రాంతం విషాదఛాయలతో నిండిపోయింది.

కలెక్టర్‍ దిగ్భ్రాంతి
కాగా గోదావరి ప్రమాదంపై భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన స్థానిక ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతంలో ప్రమాదహెచ్చరిక బోర్డులు తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. ఏరియా ఆసుపత్రి వైద్యులతో చికిత్స పొందుతున్నవారి వివరాలు, వారికి అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు.

Leave a Reply