Take a fresh look at your lifestyle.

సాగర్‌ ‌హైవేపై బోల్తాపడ్డ కారు..ఐదుగురు మృతి

జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. చింతపల్లి మండలం వింజమూరు దగ్గర హైదరాబాద్‌-‌సాగర్‌ ‌హైవేపై కారు బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. నలుగురు అక్కడికక్కడే మరణించారు.

మరోవ్యక్తి తీవ్రగాయాలుపాలు కాగా..చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ ఆ వ్యక్తి కూడా మృతిచెందాడు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. హైదరాబాద్‌ ‌నుంచి మల్లేపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికంగా ఐదుగురు మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply