Take a fresh look at your lifestyle.

ప్రైవేట్‌ హాస్పిటల్లో ఆక్సిజన్‌ అం‌దక ఐదుగురు మృతి

  • కర్నూలు పట్టణంలో తీవ్ర విషాదం 
  • విచారణకు ఆదేశించిన కలెక్టర్‌..‌మిగతా రోగుల తరలింపు

కర్నూల్‌ ‌జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది.ఓ ప్రైవేట్‌ హాస్పిటల్లో  దారుణం చోటుచేసుకుంది. అనుమతి లేకుండానే కొరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు ఆక్సిజన్‌ అం‌దక మృతి చెందారు. ఈ సంఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్‌ హాస్పిటల్పై  చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు కర్నూలు కలెక్టర్‌ ‌వీరపాండియన్‌ ‌తెలిపారు. కొవిడ్‌తో ప్రైవేట్‌ ‌దవాఖానలో చికిత్స పొందుతూ ఆక్సిజన్‌ అం‌దక వీరు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలో కేఎస్‌ ‌కేర్‌ ‌దవాఖానలో ఈ ఘటన జరిగింది. ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై వెంటనే విచారణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ‌వీరపాండియన్‌ ‌క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కొన్ని దవాఖానలు అనుమతి లేకుండానే కొరోనా చికిత్స చేస్తున్నాయని, ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. నలుగురు ఆక్సిజన్‌ అం‌దకే చనిపోయారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ‌పేర్కొన్నారు.   కర్నూలులోని కేఎస్‌ ‌కేర్‌ హాస్పిటల్  లో కొరోనా చికిత్సకు అనుమతి లేదు. అయినా కూడా నిబంధనలకు విరుద్ధంగా కొరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

ఈ క్రమంలో ఆక్సిజన్‌ అం‌దక ఐదుగురు మృతి  చెందారు. అనుమతి లేకుండానే కోవిడ్‌ ‌చికిత్స చేస్తున్నట్లు నిర్దారణ అయ్యింది. కేఎస్‌ ‌కేర్‌ హాస్పిటల్ లో కోవిడ్‌ ‌వైద్యానికి అనుమతి లేదని కలెక్టర్‌ ‌స్పష్టం చేశారు. ఘటనపై డీఎంహెచ్‌ఓ ‌విచారణ చేస్తున్నారు. కోవిడ్‌ హాస్పిటల్ గా నోటిఫైడ్‌ ‌చేయని కేఎస్కేర్‌ ‌ప్రైవేట్‌ హాస్పిటల్ లో కొరోనా బాధితులు ఆక్సిజన్‌ అం‌దక చనిపోయారని తెలుసుకుని డీఎంహెచ్‌ఓ ‌డాక్టర్‌ ‌రామగిడ్డయ్య విచారణ మొదలు పెట్టారు. కలెక్టర్‌ ‌వీరపాండియన్‌ ఆదేశాల మేరకు అధికారులు హాస్పిటల్ కి వెళ్లారు. కేఎస్‌కేర్‌ హాస్పిటల్ లో ఉన్న బాధితులందరినీ అంబులెన్స్‌లో కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. అనుమతి లేకుండా కోవిడ్‌ ‌పేషేంట్స్‌ను అడ్మిట్‌ ‌చేసుకుని అనధికారికంగా ట్రీట్మెంట్‌ ఇచ్చిన హాస్పిటల్ యజమాన్యంపై క్రిమినల్‌ ‌కేసు బుక్‌ ‌చేశారు. డిజాస్టర్‌ ‌మేనేజ్మెంట్‌ ‌చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్‌ ‌వీరపాండియన్‌ ‌తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా ప్రభుత్వం అనుమతి లేకుండా అనధికారికంగా కోవిడ్‌ హాస్పిటల్ లేదా కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్స్ ‌నడిపితే క్రిమినల్‌ ‌కేస్‌ ‌పెడతాం… సీజ్‌ ‌చేయిస్తామని కలెక్టర్‌ ‌హెచ్చరించారు.

Leave a Reply