Take a fresh look at your lifestyle.

నెలాఖరులో బ్యాంకులకు ఐదురోజుల సెలవులు

ముంబై, జనవరి 20 : నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్‌ ‌యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్‌ ‌సేవలు స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్‌ ‌డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 28న నాల్గో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు.

ఇక వారంలో ఐదు రోజుల పని, పెన్షన్‌ అప్డేషన్‌, ‌నేషనల్‌ ‌పెన్షన్‌ ‌స్కీం రద్దు, జీతాల పెంపు, ఖాళీల భర్తీ డిమాండ్లతో యునైటెడ్‌ ‌ఫోరమ్‌ ఆఫ్‌ ‌బ్యాంక్‌ ‌యూనియన్స్ ఈ ‌నెల 30,31 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. బంద్‌ ‌తో కలిపి రోజుల పాటు 12 పబ్లిక్‌ ‌సెక్టార్‌ ‌బ్యాంకులు మూతపడనున్నాయి. కేవలం 27వ తేదీన మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి.హెచ్‌?‌డీఎఫ్‌?‌సీ, యాక్సిస్‌, ఎస్‌ ‌బ్యాంక్‌ ‌తదితర ప్రైవేట్‌ ‌సెక్టార్‌ ‌బ్యాంకులు మాత్రం 26, 28, 29 తేదీల్లో తెరుచుకోవు.

Leave a Reply