Take a fresh look at your lifestyle.

ఫిట్‌మెంట్‌ ఇం‌త అన్యాయంగా ఎప్పుడూ లేదు

  • ఉద్యోగుల కడుపుకొట్టే మాదిరిగా కేసీఆర్‌ ‌తీరు
  • విపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరించడం దారుణం
  • బిజెపి జాతీయ నేత మురళీధర్‌ ‌రావు

‌కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి పక్షపాతం వొచ్చింది.. పనితీరు మూర్ఛ వొచ్చినట్లుగా ఉందంటూ బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్‌ ‌రావు ధ్వజమెత్తారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వి•డియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఉద్యోగులకు చేస్తున్న అన్యాయంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. 1974లో పీఆర్సీ ఐదు శాతం ఫిట్‌ ‌మెంట్‌ ‌ప్రతిపాదించారు.. ఇప్పటి వరకూ అలాంటి పరిస్థితి రాలేదు.. కానీ ఇప్పుడు మాత్రం 7.5 శాతం ఫిట్‌ ‌మెంట్‌ను ప్రతిపాదించారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులనే కాపాడుకోలేని ప్రభుత్వం ఇదేం ప్రభుత్వమని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగులను దోచుకోవడం ప్రభుత్వానికి మహా పాపం.. దుర్మార్గం.. ఉద్యోగుల కడుపుకొట్టే మాదిరిగా కేసీఆర్‌ ‌ప్రభుత్వం వ్యవరిస్తున్నది..

ఉద్యోగులకు అన్యాయం చేస్తే పాపం తగులుతుందని ఆయన పేర్కొన్నారు. కొరోనాతో ఇండ్ల కిరాయిలు తగ్గినయ్‌.. ‌వి•రు హెచ్‌ఆర్‌ఏ ‌స్లాబ్‌లను ఎలా తగ్గిస్తారు? అని మురళీధర్‌ ‌రావు ప్రశ్నించారు. మిట్ట మధ్యాహ్నం పీఆర్సీ కమిషన్‌ ఉద్యోగులను అత్యాచారం చేసింది.. విద్యుత్‌ ఉద్యోగులకు ఒక మాదిరిగా టీచర్లకు, ఉద్యోగులకు ఒక మాదిరిగా పీఆర్సీ ఇవ్వడం ఏంటి? అని నిలదీశారు. విద్యుత్‌ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే ఉద్యోగులకు కూడా పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు.

పార్లమెంటు సమావేశాలను 18 పార్టీలు బహిష్కరించడం పార్లమెంటును కించపరచడమేనని, పార్లమెంటులో చట్టం చేసిన తరవాత చరిత్రలో 11 సార్లు ఒక అంశంపై చర్చలు జరిపినమని, అయినా పార్లమెంటు సమావేశాలను పార్టీలు బహిష్కరించడం పార్లమెంటును కించపరచడమేనని మురళీధర్‌ ‌రావు పేర్కొన్నారు. ఢీల్లీలో కిసాన్‌ ‌ర్యాలీకి ప్రజాస్వామ్య పద్ధతిలో అనుమతి ఇచ్చామని.. కానీ ఢిల్లీలో హింసకు పరిస్థితులు దారితీశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో కాంగ్రెస్‌ ‌పార్టీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. రామమందిరం విషయంలో అన్ని వర్గాల వారు విరాళాలు ఇస్తున్నారు, టీఆర్‌ఎస్‌ ‌నేతలు కూడా ఇస్తున్నారు.. రాజకీయాలు చేయడం కరెక్ట్ ‌కాదని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply