Take a fresh look at your lifestyle.

కొరోనా పోరాటంలో తొలి విజయం

ఎం‌తో మందిని బలిగొన్న కొరోనా మహ్మారిని తరిమివేయడానికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలతో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం దేశవ్యాప్తంగా శనివారంనాడు పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. కొరోనా మిగిల్చిన విషాదాల నేపధ్యంలో ఈ కార్యక్రమం ఏ విధంగా సాగుతుందోనన్న భయ సందేహాలను పటాపంచలు చేస్తూ ఈ కార్యక్రమం సాఫీగా సాగుతోంది.ఇది అభినందించదగిన విషయం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిల్లీ నుంచి ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌ ‌గా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో మన తెలుగు కవి గురజాడ అప్పారావు కవితను ఉటంకించడం మనకు గర్వకారణం. గురజాడ అప్పారావు రాసిన దేశమంటే మట్టి కాదోయ్‌, ‌దేశమంటే మనుషులోయ్‌ అనే కవితలో సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్‌ అన్న పదాలను ప్రధాని ఉటంకించారు.

అది ఒక్క కొరోనాని తరిమివేయడానికే కాదు.అన్నింటికీ వర్తిస్తుంది. మన దేశంలో శాస్త్రవిజ్ఞానానికీ, సాంకేతికకూ, లోటు లేనట్టే, ఆర్థికంగానూ లోటు లేదు. కానీ, ఆర్థిక వ్యవస్థను కొన్ని సంస్థలు గుప్పిట్లో పెట్టుకుని దేశాన్ని పట్టి పల్లారుస్తున్నాయి. ఈ విషయం ప్రధానమంత్రికి సైతం తెలుసు.వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రణాళికా బద్దంగానే అమలు జేస్తున్నారు. ముందుగా ఊహించిన ట్టు కాకుండా, చాలా పద్దతి ప్రకారమే నిర్వహిస్తున్నారు. ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్ ‌గా పిలువబడుతున్న డాక్టర్లు, నర్సులు , పారిశుధ్య కార్మికులకు మొదటి దఫాగా వ్యాక్సినేషన్‌ ‌వేశారు. హైదరాబాద్‌ ‌లో ఈ కార్యక్రమాన్ని ప్రాంతాల వారీగా ప్రారంభించారు. నిమ్స్ ‌లో గవర్నర్‌ ‌తమిళసై , గాంధీ హాస్పిటల్స్‌లో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా ఉత్సాహంగానే హాజరయ్యారు.అయితే, తిరుపతిలో ప్రజలు భయంతో ముందుకు రాలేదని తొలివార్తలు సూచించాయి. దీనిపై భయాలను పోగొట్టడంలో ఆరోగ్య శాఖ విఫలమైంది.

కొరోనా విషయంలోనూ అంతే కొరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రచారం చివరి దశలో ముమ్మరంగా చేశారు. ముందుగా చేసి ఉంటే చాలా మంది భయానికి లోనయ్యేవారు కారు.ఇప్పుడు కూడా వ్యాక్సిన్‌ ‌వల్ల సైడ్‌ ఎఫెక్టులు ఉండవని ప్రచారం చేయడంల విఫలమ్యాయరనే అనిపిస్తోంది.అయితే భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థ వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభం రోజున తమ వ్యాక్సిన్‌ ‌వల్ల సైడ్‌ ఎఫెక్టస్ ‌వొస్తే అందుకు పరిహారం చెల్లిస్తామనీ, ఉత్తమమైన వైద్యాన్ని అందిస్తామని ప్రకటించింది.ఈ రకమైన భరోసా ముందుగా చేసి ఉంటే చాలా మందిలో వ్యాక్సిన్‌ ‌పై అనుమానాలు పోయి ఉండేవి. అయితే, వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభాన్ని ప్రచారార్భాటం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. సామాన్యులకు అందించే కార్యక్రమంగా దీనిని నిర్వహిస్తారేమోనని అనుకున్నప్పటికీ వీఐపీల ద్వారా దీని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కొరోనా విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటోందంటూ ప్రధానమంత్రి మోడీ చేసిన ప్రసంగంలో కొంత అత్యుక్తి ఉన్నా, పూర్తిగా అవాస్తవం కాదు.

ప్రజలకు వ్యాక్సిన్‌ ‌విషయంలో అవగాహన కల్పించడంలో మరింత శ్రద్ధ చూపి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అందరినోటా వినిపిస్తోంది. అయితే, ప్రపంచంలో అతి పెద్ద దేశంలో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం ఒకే రోజున ఇంత విస్తృతంగా నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. కొరోనా రోగులకు సేవల దించిన ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్ ‌తమ యోగక్షైమాల గురించి ఆలోచించకుండా వైద్యరంగంలోకి ఉరకడం దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ద పడతున్న సైనికులతో పోల్చడం సమంజసంగానే ఉంది. సైనికులు చూపిన సమరోత్సాహం మాదిరిగానే కోవిడ్‌ ‌ను తరిమికొట్టేందుకు వారియర్స్ ‌చూపిన శ్రద్ధాసక్తులు,అంకిత భావం బాగా పని చేసింది. కొరోనా వొస్తే ఇంత భారీ ఎత్తున వైద్య సేవలందించాలన్న విషయాన్ని కేంద్రం కూడా అంచనా వేయలేదు. దానికి తోడు దశాబ్దాలుగా మన హాస్పిటల్స్ అన్నీ అధర్మాసుపత్రులుగా ముద్ర పడ్డాయి.

వైద్య రంగం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ, ఏటా కేంద్రం, రాష్ట్రాలు వేల కోట్ల నిధులను కేటాయిస్తున్నప్పటికీ హాస్పిటల్స్ ‌జవాబుదారీ తనం లేకపోవడం వల్ల తగిన సౌకర్యాలు లేకపోవడం, దాంతో వ్యాధిగ్రస్తులకు కు అత్యవసర సేవలు అందకపోవడం వంటి లోటుపాట్లు చోటు చేసుకున్నాయి.ఈ విషయం గుర్తుకు రావడం వల్లనే ప్రధానమంత్రి భావోద్వేగానికి గురి అయినట్టు అనిపిస్తోంది. అయితే, అగ్రరాజ్యమైన అమెరికాతో పోలిస్తే మన దేశంలో కొరోనా చికిత్సలు చెప్పుకోదగిన రీతిలోనే జరిగాయి. ప్రైవేటు హాస్పటల్స్ ‌ల్లో జరిగిన అవకతవకలు, డబ్బు గుంజే యత్నాల తో కొరోనా చికిత్సలు అప్రదిష్టపాలయ్యాయి.వ్యాధికి గురయిన వారిలో భయవాతావరణాన్ని సృష్టించాయి. ఇక పైనా కొరోనా వ్యాక్సిన్‌ ‌వొచ్చింది కనుక అటువంటి భయాలు తొలగిపోతాయనే ఆశిద్దాం. అంతేకాకుండా ప్రధాని పేర్కొన్నట్టు మరో రెండు వ్యాక్సిన్లు కూడా త్వరలో రానున్న దృష్ట్యా వ్యాక్సిన్ల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మన సైంటిస్టులు, నిద్రాహారాలు మాని నిరంతరం పరిశోధనలు జరపడం వల్లనే ఈ రెండు వ్యాక్సిన్లు ఇంత త్వరగా వొచ్చాయని ప్రధాని అన్న మాటల్లో అసత్యం లేదు. పొరుగు లేదా శత్రు దేశాలనుంచి దేశ ప్రజలను రక్షించేందుకు సైనికులు ఏ మాదిరిగా పోరాటం సాగిస్తున్నారో, మన శాస్త్రజ్ఞులు కూడా నిష్కళంకంగా,నిస్వార్దంగా సేవలందిస్తున్నారు.ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే. మొత్తం మీద ప్రజలు కోరుకున్న వ్యాక్సిన్‌ ‌వొచ్చింది. వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభ పక్రియ మన తెలుగు కవి గురజాడ కవితా పంక్తుల ఉల్లేఖనంతో ప్రారంభం కావడం మనకు గర్వకారణం.

Leave a Reply