ట్విట్టర్ వేదికగా యువత ప్రధాని మోడీ ప్రశంస
న్యూ దిల్లీ, జనవరి 19 : 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకా అందించడంలో భారత్ మరో ఘనతను సాధించింది. దేశంలో ఈ వయస్సు ఉన్న 50 శాతం యువకులు టీకా మొదటి డోసును పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యువకులను ప్రశంసించారు. ‘యువత, యువ భారతదేశం మార్గాన్ని చూపుతుంది! ఇది ప్రోత్సాహకరమైన వార్త. ఇదే వేగాన్ని కొనసాగిద్దాం. టీకాలు వేయడం, తీసుకోవడం, అన్ని కొరోనా సంబంధిత ప్రోటోకాల్‌లను పాటించడం చాలా ముఖ్యం. మనమందరం కలిసి ఈ మహమ్మారిపై పోరాడదాం..’ అంటూ ప్రధాని ట్విట్ చేశారు.
అంతకుముందు మన్సుఖ్ మాండవియా ట్విట్ చేస్తూ.. భారత్ కోవిడ్‌పై చేస్తున్న పోరాటంలో కీలక రోజని.. 15-18 ఏళ్ల మధ్య ఉన్న మన యువకులలో 50 శాతం కంటే ఎక్కువ మంది కొరోనా టీకా మొదటి డోసు పొందారని ట్విట్ చేశారు. టీకా పట్ల వి• ఉత్సాహం ప్రజలకు మరింత స్ఫూర్తినిస్తుందంటూ ట్విట్ చేశారు. కాగా.. గత 24 గంటల్లో 76 లక్షల కంటే ఎక్కువ మోతాదుల టీకా డోస్‌లను పంపణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం ఉదయం వరకు 158.88 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.