Take a fresh look at your lifestyle.

పార్లమెంట్‌ ‌మొదటి రోజు సమావేశాలు

నిరసనల నడుమ ఉభయ సభలు వాయిదా ..!
కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టనున్న 300 మొబైల్‌ ‌ఫోన్ల గూఢచర్యం..?
ప్రతిపక్ష పార్టీల నిరసనలతో సోమవారం మొదటి రోజు పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు వాయిదా పడ్డాయి. ప్రధాని మోదీ తన మంత్రిమండలిలోకి తీసుకున్న కొత్త మంత్రులను సభకు పరిచయం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీల నిరసనలు తారాస్థాయికి చేరాయి. దీన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తప్పుపడుతూ ‘‘లోక్‌సభలో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రవర్తన విచారకరం, దురదృష్టకరం. కాంగ్రెస్‌ ‌పార్టీ అనారోగ్యకరమైన పంథా అనుసరిస్తున్నది’’ అని అన్నారు. దీనికి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సోమవారం పార్లమెంట్‌ ‌వానాకాలం సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా, పార్లమెంట్‌లో అన్ని సమస్యలపై ఆరోగ్యకరమైన రీతిలో చర్చ జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ‘‘మహమ్మారి కొరోనాకి సంబంధించిన ప్రతి సమస్యపై దీనికి వ్యతిరేకంగా మా ప్రభుత్వం జరిపిన పోరాటంపై చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను. మహమ్మారిని ఎదుర్కున్న తీరుపై ప్రదర్శన ఇవ్వడానికి రేపు సాయంత్రం 4 గంటలకు జరిగే సెషన్‌కు హాజరు కావాలని సభ్యులను కోరుతున్నాను. ఈ సమస్యపై సభలో కూడా చర్చించవొచ్చు’’ అని ప్రధాని మోడీ అన్నారు. కోవిడ్‌ -19 ‌మహమ్మారి సమయంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఖరిపై మరియు రైతుల ఆందోళనపై ప్రభుత్వం తీసుకున్న వైఖరితో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని బోనులో నిలబెట్టాలని చూస్తున్నప్పుడు మోడీ ప్రభుత్వం పెద్ద ఎజెండాను సిద్ధం చేసి పార్లమెంటు నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నది.

మరోవైపు ఆంధ్ర ఎంపీలు విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌విషయంలో పార్లమెంటులో తమ గళం విప్పేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఇరు సభలు వాయిదా పడ్డాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలకు వాడి వేడి సెగ తప్పేలా లేదు. ఎందుకంటే ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సంచలనాత్మక కథనం ‘‘ఇజ్రాయెల్‌ ‌కంపెనీ ఎన్‌ఎస్‌ ఓ ‌గ్రూప్‌ ‌పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌ద్వారా భారతదేశంలో 300కి పైగా మొబైల్‌ ‌ఫోన్‌ ‌నంబర్లను లక్ష్యంగా చేసుకుని గూఢచర్యం జరుగుతున్నట్టు గ్లోబల్‌ ‌సహకార దర్యాప్తు ప్రాజెక్ట్(‌గ్లోబల్‌ ‌కొలాబొరేటివ్‌ ఇన్వెస్టిగేటివ్‌ ‌ప్రాజెక్ట్) ‌వెల్లడించింది. ఇది జరిగిన ఒక రోజు తరువాత పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇద్దరు మంత్రులు, ముగ్గురు ప్రతిపక్ష నాయకులు, ఒక కాన్స్టిట్యూషనల్‌ అథారిటీ, అనేక మంది పాత్రికేయులు మరియు వ్యాపార వేత్తలతో కూడిన మూడువందల ‘‘ధృవీకరించబడిన’’ ఫోన్‌ ‌నంబర్ల జాబితా నిఘాలో ఉన్నట్టు వార్తా కథనాలు వొచ్చాయి. మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, పాత్రికేయులు, న్యాయ వ్యవస్థ, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, హక్కుల కార్యకర్తలు అనేక ఇతరుల ఫోన్‌ ‌నెంబర్లు నిఘాలో భాగంగా గూఢచర్యానికి గురవుతున్నారని కథనాలు వొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సభలు సజావుగా జరగటం కష్టంగా కనిపిస్తున్నది.

రేవంత్‌ ‌రెడ్డి అరెస్ట్ ‌ప్రస్తావన
తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి తనను గృహ నిర్బంధానికి గురి చేసినట్టు లోక్‌ ‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. గృహ నిర్బంధం వలన పార్లమెంటుకు తానూ రాలేక పోతానని ఆయన స్పీకర్‌కు నివేదించనున్నారు. ‘‘నేను పార్లమెంటుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, కాని రాష్ట్ర ప్రభుత్వం నా ఇంటి వెలుపల పోలీసులను మోహరించింది మరియు నన్ను గృహ నిర్బంధంలో ఉంచింది. 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వారి బంధువులు, పార్టీ నాయకులు మరియు ఐఎఎస్‌ అధికారికి మార్కెట్‌ ‌ధర కంటే తక్కువ విలువకు విక్రయిస్తే ప్రశ్నించినందుకు ఇలా జరిగిం•ని స్పీకర్‌కి తెలపడానికి సిద్ధమవుతున్నారు. ప్రధాని మోడీకి మంత్రి అమిత్‌ ‌షా, సిబిఐ డైరెక్టర్లలకు కూడా రాతపూర్వక ఫిర్యాదు అందజేయడానికి రేవంత్‌ ‌రెడ్డి సిద్ధపడ్డారు. పార్లమెంటులో కూడా 50 ఎకరాల భూమిని కెసిఆర్‌ ‌బంధువులు హస్తగతం చేసుకున్నారనే సమస్యను లేవనెత్తుతామని రేవంత్‌ ‌రెడ్డి ఒక వైపు చెబుతుండగా. కాంగ్రెస్‌ ‌తెలంగాణ స్టేట్‌ ఇం‌చార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌కూడా ఈ విషయంపై ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడారు.

తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డిని పోలీసులు ఇల్లీగల్‌గా అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు నడుస్తున్న సమయంలో ఓ ఎంపీ అయిన రేవంత్‌ను ఒకరోజు పాటు హౌజ్‌ అరెస్ట్ ‌చేయడాన్ని తప్పుబట్టారు. దీనిపై లోక్‌ ‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లాకు ఏఐసీసీ తరుపున ఫిర్యాదు చేయనున్నట్లు అయన చెప్పారు. కేసీఆర్‌ అం‌డర్‌లో పోలీసులు చేపట్టిన రేవంత్‌ ‌హౌజ్‌ అరెస్ట్ ‌చర్యను కాంగ్రెస్‌ ‌పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేసీఆర్‌ ‌హిట్లర్‌ ‌పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. రాష్ట్ర అసెంబ్లీ పనితీరును కూడా కేసీఆర్‌ ‌తగ్గించారని చెప్పారు. సంవత్సరానికి దాదాపు 98 రోజులు సాగాల్సిన చట్ట సభలను కేవలం 30, 40 రోజులకే పరిమితం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కేసీఆర్‌ ‌కింగ్‌ ‌లాగా జీవిస్తున్నారని, అదే తరహాలో పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేసారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరిక వ్యవస్థను ప్రజలు ఆమోదించరని గుర్తు చేశారు.

Leave a Reply