Take a fresh look at your lifestyle.

హైద్రాబాద్‌లో తొలి కరోనా కేసు

డెభై  దేశాలకు విస్తరించిన భయంకరమైన కరోనా వైరస్‌ ‌తెలంగాణకు కూడా  సోకిందన్న వార్త  రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వెంటనే  రాష్ట్ర  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌  అ‌ప్రమత్తమై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. నిజానికి ఇది స్థానిక కేసు కాదనీ,  బెంగళూరులో  సాఫ్ట్ ‌వేర్‌ ఉద్యోగి గా పని చేస్తున్న  24 ఏళ్ళ యువకుడు కంపెనీ పని మీద  దుబాయ్‌ ‌వెళ్ళి ఐదు రోజులు ఉండి బెంగళూరు రాగానే అతడికి జ్వరం వచ్చింది., అనుమానం నివృత్తి చేసుకునేందుకు బస్సులో హైదరాబాద్‌ ‌వచ్చి  కార్పొరేట్‌ ‌దవాఖానాలో చేరాడు. అతడితో ఆ బస్సులో ప్రయాణించిన వారందరికీ పరీక్షలు చేయించినట్టు రాజేందర్‌ ‌చెప్పారు.ఆ యువకునికి కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్దారణ కావడంతో గాంధీ దవాఖానాలోని ప్రత్యేక వార్డులో  చికిత్స అందిస్తున్నారు. ఆ యువకుడు  బెంగళూరులో కుటుంబ సభ్యులతో ఐదు రోజులు ఉన్నా వ్యాధి గురించి ఎక్కడా బయటపడక పోవడం గమనార్హం. జ్వరం తగ్గకపోవడంతో ఉత్తమ చికిత్స కోసం బస్సులో హైదరాబాద్‌ ‌వచ్చాడు.

కరోనా వైరస్‌ ‌చైనాలో మొదట బయటపడగానే  దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ముందు హైదరాబాద్‌ అ‌ప్రమత్తమైంది. మంత్రి రాజేందర్‌ గాంధీ,  తదితర దవాఖానాల్లోనూ, రైల్వేస్టేషన్‌, ‌బస్సు స్టేషన్‌ ‌లలోనూ ప్రత్యేక పరీక్షా బృందాలను ఏర్పాటు చేశారు. దవాఖానాలన్నింటినీ ఆయన సందర్శించి రోగులకు ముందు జాగ్రత చర్యలు  తీసుకునే విధంగా వైద్యులను  అప్రమత్తం చేశారు.  గాందీ,  ఫీవర్‌, ‌చెస్ట్ ‌దవాఖానాలలో 40 పడకలు ఏర్పాటు చేసినట్టు,  రోగుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించే ఏర్పాట్లు చేసినట్టు రాజేందర్‌  ‌వివరించారు. హైదరాబాద్‌ ‌లో మెరుగైన వైద్య సౌకర్యాలున్నందున ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి రోగులు వచ్చి ఇక్కడి కార్పొరేట్‌ ‌దవాఖానాల్లో చికిత్స పొందడం సర్వసాధారణం.

హైదరాబాద్‌ ‌లోని కార్పొరేట్‌ ‌దవాఖానాలన్నింటిలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా   వేలాది మందికి సోకిన  ఈ వైరస్‌ ‌తొలిసారిగా హైదరాబాద్‌ ‌లో  బయటపడింది. హైదరాబాద్‌ ‌లోనూ, తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో  కరోనావైరస్‌ ‌పై ప్రజలకు  అవగాహన కల్పించి  వైరస్‌ ‌బారిన పడకుండా  ముందు జాగ్రత్త చర్యలను  రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది. ముఖ్యంగా, మూతికి గుడ్డ కట్టుకోవాల నీ, కాచిన నీరు తాగాలనీ, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదని  విస్తృతమైన ప్రచారం సాగించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా వరకూ ప్రతిఫలించాయి.అయితే,    పొరుగు దేశాల నుంచే కాకుండా, రాష్ట్రాల నుంచి వ్యక్తుల రాకపోకలను నిలువరించలేం.  ఇటలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఢిల్లీలో పరీక్షలు చేయగా, కరోనా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఈ వైరస్‌ అమెరికా, ఆస్ట్రేలియా,  ఐర్లండ్‌, ‌థాయిలాండ్‌, ‌లలో ఒక్కొక్క పౌరుడు వంతను ఇంతవరకూ మరణించారు.  కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ ‌మరో  90 రోజుల్లో అందుబాటులోకి రాగలదని ఇజ్రాయెల్‌ ‌వైద్యులు ప్రకటించారు. కానీ, దీని ఖరీదు సామాన్యులకు అందుబాటులో ఉండకపోవచ్చునంటున్నారు.

First corona case in Hyderabad  చైనాలోని వూహన్‌ ‌రాష్ట్రంలో తొలి సారి బయటపడిన     కరోనా వైరస్‌ ‌గతంలో   ఇంతకన్నా ఎక్కువ భయాందోళనలను రేపిన   సార్స్ ,  ‌చికెన్‌ ‌గున్యా,  తదితర వైరస్‌ ‌ల మాదిరిగా  ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.     అగ్రరాజ్యమైన  అమెరికా, దాని మిత్ర దేశాలైన ఆస్ట్రేలియా సహా  అన్ని ప్రాంతాల్లో   ఈ వైరస్‌ ‌విస్తరిస్తోంది.  ఇరాన్‌ ‌లో కూడా   కరోనా కేసులు  300 పైగా నమోదు అయ్యాయి.   కొన్ని దేశాలు కరోనా బాధితుల సంఖ్యనూ, మృతుల సంఖ్యనూ తక్కువ చేసి చూపుతున్నట్టు  సమాచారం అందింది. మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో సరైన చర్యలు తీసుకుంటూ   రోగులకు  ధైర్యం చెబుతున్నాయి. కరోనా వైరస్‌ ‌గురించి పుకార్లు కూడా   ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.  ఈ పుకార్లను నమ్మొద్దని  తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌ ‌గడిచిన కొంత కాలంగా  పత్రికలు,  ప్రసార మాధ్యమాల ద్వారా   ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో  క్రియాశీలకంగా  వ్యవహరిస్తున్న ఈటెల ను పలువురు అభినందిస్తున్నారు.   కేన్సర్‌ ‌మాదిరిగానే    కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ఈ వ్యాధిని అరికట్టడం సాధ్యమే

Leave A Reply

Your email address will not be published.