Take a fresh look at your lifestyle.

మహమ్మారి కొరోనా కు సంవత్సరీకం…. ప్రపంచ దేశాల విజయమే..!

“గత సంవత్సరాలతో పోల్చితే 2020 చాలా భిన్నమైంది. ఈ ఏడాది ప్రపంచ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకుంది. కొత్త గుణపాఠాల్ని నేర్పింది. వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపింది. మన ప్రణాళికలు మరింత పటిష్ఠంగా ఉండాలని తెలియజేసింది. ఈ నేపథ్యంలో కొరోనా మహమ్మారితో పాటు ఈ ఏడాది ప్రపంచాన్ని కుదిపేసి,ఏడాదంతా ప్రతి కుటుంబాన్ని కొరోనా మహమ్మారి, అతలాకుతలం చేసి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవజాతి అంతగా భయపడ్డది కొరోనా కే..! 2019లోనే చైనా లో వెలుగు చూసినా.. 2020లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి తన విశ్వరూపాన్ని చూపించింది.”

ప్రపంచ మమమ్మారి. కొరోనా వైరస్‌ను అంతం చేయడానికి ఏ దేశానికి ఆ దేశం పోరాడితేనో, ప్రయత్నిస్తేనో సరిపోలేదు. ప్రపంచ దేశాల సమష్టి కృషి మాత్రమే కనిపించని మహమ్మారితో పోరులో మానవ విజయాన్ని సాకారం చేయగలుగుతుంది. నిజానికి ప్రపంచంలోని చాలా దేశాలతో జనాభా తో పోలిస్తే భారతదేశంలో వ్యాప్తి, మరణాల రేటు తక్కువగా ఉందని అనిపిస్తుంది.కొరోనా కేసుల నవెరీదు విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ వ్యాప్తి రేటు, మరణాల శాతాన్ని బట్టి చూస్తే భారత్‌ ఒకింత మెరుగైన పరిస్థితుల్లోనే ఉందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇందుకు కారణం మోడీ సర్కార్‌ ‌కొరోనా వైరస్‌ ‌విషయంలో వేగంగా స్పందించి మార్చి లో మొదలైన మాయాదారిని, దేశంలో కేసులు నాలుగంకెల స్థాయికి కూడా చేరకముందే, పూర్తి లాక్‌ ‌డౌన్‌ను విధించడం వ్యాప్తి వేగం తగ్గడానికి కారణం. అయితే, తొలి రోజుల్లో చూపినంత చొరవను, వ్యూహ నిపుణతను కేంద్రం తరువాత కాలంలో చూపలేదన్న విమర్శలను కొట్టిపారేయలేం. ఆస్పత్రుల్లో వసతుల కొరత, సకాలంలో వైద్యం అందకపోవడం, టెస్టులు చేయక పోవడం వంటి వ్యవస్థాగత లోపాలే ఇందుకు కారణంఅయినప్పటికీ . ఆ లోపాలను సవరించుకుని ముందుకు సాగడం ముదావహం .

భారతదేశ జనాభా 138 కోట్లు. ఆ జనాభాకు ఒక మిలియన్‌ ‌కేసులు అన్నది పెద్ద విషయం కాదన్న భావన ప్రభుత్వ వాదనలో వినిపించింది. అయితే దేశంలో ఒక్క ప్రాణం కూడా కొరోనా విషయంలో సర్కార్‌ ‌నిర్లక్ష్యం కారణంగా మరణించడానికి వీల్లేదు. మానవుని నుంచి మానవునికి సంక్రమించే ఈ వైరస్‌ ‌వ్యాప్తి చెందడానికీ, ప్రాణాలను కబలించడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదన్న సంకల్పంతో ముందుకు సాగి రాష్ట్రాలకు సలహాలు ఇస్తూ ముందుకు సాగింది. వైరస్‌ ‌బారిన పడిన వారెవరైనా సరే, ఎంతమందైనా సరే అందరికీ ప్రభుత్వమే వైద్యం చేయించాల్సిన పరిస్థితిని కల్పించుకుంది.వ్యయం ప్రయాసాలకు తలోగ్గద్దని డైరెక్షన్‌ ఇచ్చింది.భారత దేశం విషయానికి వస్తే మొత్తం జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే, అమెరికా, బ్రెజిల్‌ ‌వంటి దేశాలలోని మరణాల రేటుకు మనకు పోలికే లేదు. ప్రతి మిలియన్‌కు కేసుల సంఖ్యను చూస్తే భారతదేశం మరణాలలో చూస్తే అమెరికాలో అగ్రస్థానంలో నిలిచింది. 2,92,55344 కేసులు నమోదు అయి, 5,25776 మంది చనిపోయి ప్రపంచదేశాలకు వణుకు పుట్టింది.

జనాభా నిష్పత్తిని పరిగణించకపోతే, కేసుల సంఖ్య రీత్యా భారత్‌ ‌ప్రపంచంలో రెండెవ స్థానంలో ఉన్నది. ఇప్పటి వరకు 1,11,12241 కేసులు నమోదు కాగా 1,57195 మరణాలతో భారత్‌ ‌కేవలం 1శాతం మాత్రమే నష్టాపోవాల్సి వచ్చింది. అంటే రికవరీ రేటు 99 శాతం ఉండడం గమనార్హం. అయితే ఈ గణాంకాలను వల్లె వేసుకుంటూ మన భుజాలను మనం చరుచుకుంటే సరిపోదు.అమెరికా వంటి దేశాలతో పోల్చుకుంటూ సంతృప్తిపడటం తగదు. న్యూజిలాండ్‌ ‌వంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ కొరోనా వ్యాప్తి భారత్‌ ‌లో నియంత్రించడానికి అవకాశం ఉన్న స్థాయిలోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇప్పుడు సెకండ్‌ ‌వేవ్‌ ‌కట్టడికి కఠిన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి చేతులు దాటిపోతుందని హెచ్చరిస్తున్నది. కాకపోతే వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వచ్చిందన్న భరోసా ఎలాంటి రభస లేకుండా ప్రశాంతం మైన జీవితానికి అలవాటుపడి నిర్లక్ష్యం చేస్తే, ప్రపంచ దేశాల లెక్కలతో భారత్‌ ‌లెక్కలు పోల్చి చూస్తే బ్రహ్మాండం అంటూ జబ్బలు చరుచుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని. వైద్య నిపుణులు అభిప్రాయ పడుచున్నారు.

రాష్ట్రంలో మొదటి కేసు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ‌లో నమోదు అయ్యింది. ముందుగానే పసిగట్టి ఆ తీవ్రతకు అడ్డుకట్ట వేయడంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం సఫలీకృతమైంది. ఇప్పటికీ దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే తెలంగాణలో కొరోనా కట్టడిలోనే ఉందంటే అందుకు కారణం ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే కారణం. అయినప్పటికీ సంవత్సర కాలంలో 2,98923 కేసులు నమోదు కాగా 1634 మందిని పోట్టన పెట్టుకుంది. కేంద్రం రాష్ట్రాలను ఆదుకునే విషయంలో రాజకీయ లాభ నష్టాల బేరీజులో మునిగి తేలడం వల్లనే లాక డౌన్‌ ‌సడలింపులు అనివార్యమయ్యాయని అమర్త్య సేన్‌ ‌వంటి నిపుణులు చెప్పడం విశేషం.

కోవిడ్‌ 19 ‌మాత్రం సంవత్సర కాలంలో చాల పాఠాలను నేర్పింది ,ఎన్నో విషయాలను చవిచూడాల్సి వచ్చింది. జీవితంలో కని,విని ఎరుగని కొత్త జీవితాలను గడపాల్సి వచ్చింది. కొరోనా మహమ్మారి మంచి క్రమశిక్షణను నేర్పింది. పరిశుభ్రతను అలవర్చింది. 2020 సంవత్సరం ఫీడకలలా మిగిలింది.వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి రావడంతో చీకటి రోజులకు కొత్త సంవత్సరంలో తెరపడనుందన్న ఆశ ప్రతి వ్యక్తిలో చిగురిస్తోంది. ఏదేమైనా, ప్రతి ఉపద్రవం వెనుక ఓ పాఠం ఉంటుందన్న చందంగా.. ఈ మహమ్మారి కూడా మనకు చాలా విషయాలు నేర్పింది…..దేశంలో ఒక్కసారిగా కొరోనా కొత్త స్ట్రెయిన్‌ .. ‌కొత్త సంవత్సరం టెన్షన్‌ ‌తో ప్రారంభం అయ్యింది.తెలంగాణ సర్కార్‌ అలర్ట్ అయింది. బ్రిటన్‌ ‌లో పుట్టిన స్ట్రెయిన్‌ ‌కేసుల నమోదు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్‌ ‌కార్యాచరణపై వైద్య శాఖ అప్రమత్తతో పెద్ద ప్రమాదం నుండే గట్టేక్కిందనే చెప్పాలి.

కొరోనా మహమ్మారి ఒక సంవత్సర కాలం నుండి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా కొరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. ఫార్మాకు పుట్టిల్లు అయిన భారత్‌ అం‌దుకు మినహాయింపు కాలేదు. పార్మా కు నిలయం అయిన తెలంగాణ రాష్ట్రం కూడా. మినాయింపు కాలేదు. కొరోనా విస్తరణ భారత్‌ ‌లో పెరిగిన తీరును చూస్తుంటే…మహమ్మారి జన సాంద్రత అధికంగా ఉండే మహానగరాలపై (మెట్రోపొలిటిన్‌) ఎక్కువ ప్రభావం చూపిందని అర్ధమయింది. మహమ్మారి వైరస్‌ ‌వ్యాప్తి తీవ్రతను ముందుగానే గుర్తించిన కేసీఆర్‌ ‌రాష్ట్రంలో లాక్‌ ‌డౌన్‌ అత్యంత కఠినంగా అమలు చేశారు. మనందరి జీవితాల్లో ప్రతి సంవత్సరం కొన్ని జ్ఞాపకాల్ని మిగిల్చి వెళుతుంది. గత సంవత్సరాలతో పోల్చితే 2020 చాలా భిన్నమైంది. ఈ ఏడాది ప్రపంచ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకుంది. కొత్త గుణపాఠాల్ని నేర్పింది. వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపింది. మన ప్రణాళికలు మరింత పటిష్ఠంగా ఉండాలని తెలియజేసింది. ఈ నేపథ్యంలో కొరోనా మహమ్మారితో పాటు ఈ ఏడాది ప్రపంచాన్ని కుదిపేసి,ఏడాదంతా ప్రతి కుటుంబాన్ని కొరోనా మహమ్మారి, అతలాకుతలం చేసి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవజాతి అంతగా భయపడ్డది కొరోనా 2019లోనే చైనా లో వెలుగు చూసినా.. 2020లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి తన విశ్వరూపాన్ని చూపించింది.

వుహాన్లో కొత్త రకం న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయన్న చైనా అధికారిక ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) 2019, డిసెంబరు 31న తొలిసారి పరిగణనలోకి తీసుకుంది. అనంతరం కొత్త సంవత్సరం రోజే దీనికి సంబంధించిన వివరాల్ని కోరింది. రోజులు గడుస్తున్న కొద్దీ వైరస్‌ ‌మరింత వేగంగా వ్యాపించింది. జనవరి 9న ఇది కొత్తరకం కొరో వైరస్‌ అని ప్రపంచానికి తెలిసింది. కొన్నాళ్ల తర్వాత ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తోందని అర్థమైంది. జనవరి 11న తొలి మరణం నమోదైంది. అదే నెల 13న చైనా వెలుపల తొలి కేసు నమోదైంది. అలా డ్రాగన్‌ ‌సరిహద్దుల్ని దాటిన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దావాగ్నిలా వ్యాపించింది. సంవత్సర కాలంగా కొరోనా నిరోధక వ్యాక్సిన్‌ ‌కోసం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిర్విరామంగా కృషి చేయడం వల్లనే వ్యాక్సిన్‌ ‌వచ్చిన విషయం మర్చిపోకూడదు.అయితే రాష్ట్రంలో అన్ని వ్యాపారాలు , మార్కేట్లు, విద్యా సంస్థలల్లో గతంలో నిర్వహించిన విదంగా సామూహిక సామాజిక కార్యక్రమాలకు అవకాశం ఉండదని తెలుసుకోవాలి.

ఒక్కడిగా నిలవడమంటే…పోరాటంలో సామూహిక శక్తిగా మారడమేనని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచమంతా ఒక్కటై ఒక మహమ్మారితో పోరాడింది. ఈ పోరాటంలో ప్రతి వ్యక్తీ సైనికుడే. అందుకే సరిహద్దుల్లో దేశ రక్షణ విధులు నిర్వర్తించే జవాన్‌ ఎం‌త అప్రమత్తంగా ఉంటాడో…ప్రతి పౌరుడూ అలాగే కొరోనా వ్యాప్తి నిరోధక యుద్ధంలో అంతే అప్రమత్తంగా ఉండాలి. అంది సామాజిక బాధ్యతగా గుర్తించాలి. మానవాళి మనుగడకు ఏర్పడిన ముప్పును తప్పించే ఈ మహత్తర యుద్ధంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడై ముందుకు సాగాలి.

sangani malleswar
డా.సంగని మల్లేశ్వర్‌,
‌విభాగాధిపతి జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్‌, ‌సెల్‌-9866255355

Leave a Reply