Take a fresh look at your lifestyle.

ఛత్తీస్‌ఘఢ్‌ అడవుల్లో కాల్పుల మోత

ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి – ఒక్కొక్కరిపై 5 లక్షల రివార్డు

సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా పరిసర ప్రాంతాల అడవుల్లో కాల్పుల మోత మోగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఈ సంగటనలో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కటెకల్యాణ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోఆర్వాల్‌అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

వీరిపై ప్రభుత్వం 5 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ ‌పల్లవ్‌ ‌దృవీకరించారు. మృతి చెందిన మహిళా మావోయిస్టులు సుకుమార్‌ ‌జిల్లాకు చెందిన రాజేముచ్కి మరో మహిళా సుకుమార్‌ ‌జిల్లాకు చెందిన చింతాల్లార్‌ ‌గ్రామానికి చెందిన గీతామార్తం, అదే సుకుమార్‌ ‌జిల్లాకు చెందిన జ్యోతి నిప్పోలుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. సంగటన స్థలం వద్ద బోర్‌ ‌రైఫిల్స్, ‌రెండు నాటు తుపాకులు, ఐఇడి వైర్‌ ‌మరియు మావోయిస్టుల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply