Take a fresh look at your lifestyle.

భారత్‌ – ‌చైనా సరిహద్దుల్లో కాల్పులు

  • చైనా కాల్పుల్లో ఒక సైనికాధికారి, ఇద్దరు జవాన్లు మృతి
  • గాల్వన్‌ ‌వ్యాలీ సపంలో ఘర్షణ జరిగినట్లు ప్రభుత్వం ప్రకటన
  • త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ అత్యవసర సమావేశం

భారత్‌ – ‌చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చైనా బలగాలు రెచ్చిపోయి భారత బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. గాల్వాన్‌ ‌లోయలో భారత్‌ – ‌చైనా సైనిక బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. గాల్వన్‌ ‌వ్యాలీ సరిహద్దు నుంచి సైనికుల ఉపసంహరణ సమయంలో ఈ ఘర్షణ జరిగినట్లు భారత ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో చెప్పింది. సరిహద్దులోని గాల్వన్‌ ‌వ్యాలీలో సోమవారం రాత్రి ఇరు దేశాల సైన్యం మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని.. ఇందులో ఒక సైనికాధికారి, ఇద్దరు జవాన్లు చనిపోయారని భారత సైన్యం చెప్తోంది. చైనా సైన్యానికి కూడా నష్టం వాటిల్లందని భారత సైన్యం పేర్కొంది. అయితే.. చైనా సైన్యం వైపు ఎంతమంది సైనికులు చనిపోయారని కానీ గాయపడ్డారని కానీ స్పష్టమైన సమాచారం ఏదీ లేదు. భారత సైన్యం ప్రధాన కార్యాలయం జారీచేసిన ప్రకటన ప్రకారం.. భారతదేశం ఏకపక్ష చర్యలు చేపట్టరాదని, ఇబ్బందులను పెంచరాదని చైనా స్పందించి నట్లు రాయిటర్స్ ‌వార్తా సంస్థ తెలిపింది. అయితే.. చైనా సైన్యం వైపు ఎంతమంది సైనికులు చనిపోయారని కానీ గాయపడ్డారని కానీ స్పష్టమైన సమాచారం ఏదీ లేదు. భారత సైన్యం సరిహద్దు దాటి వచ్చిందని.. చైనా సైనికుల ద దాడి చేసిందని చైనా ఆరోపించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ చెప్పింది. భారత సైన్యం ప్రధాన కార్యాలయం జారీచేసిన ప్రకటన ప్రకారం.. ఇరు దేశాల సైన్యాలకు చెందిన సీనియర్‌ అధికారులు ఘర్షణ జరిగిన ప్రాంతంలో సమావేశమై సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నారు. భారత్‌ – ‌చైనాల మధ్య 1975 తర్వాత.. ప్రాణ నష్టానికి దారితీసిన తొలి హింసాత్మక సంఘటన ఇదేనని ఏఎన్‌ఐ ‌వార్తా సంస్థ పేర్కొంది. గాల్వాన్‌ ‌లోయ ప్రాంతం ఇండియా – చైనాల మధ్య లదాఖ్‌ ‌సరిహద్దు రేఖ ద ఉంది. ఈ ప్రాంతంలో చైనా బలగాలు ఇటీవల భారత భూభాగంలోకి ప్రవేశించటంతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఉద్రిక్తతలను తగ్గించటానికి భారత్‌ – ‌చైనాలు తూర్పు లదాఖ్‌లో చర్చలు జరుపుతున్నాయి.

అనేక వారాలుగా సరిహద్దులో ఇరు దేశాల సైనిక బలగాలు మోహరించిన అనేక ప్రాంతాల విషయంలో ఇరు పక్షాల మధ్య.. భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సైనిక వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని ఇరు దేశాల సైనిక నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో కాలపులు చోటు చేసుకోవడం ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌తో అత్యవసర సక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీడీఎస్‌ ‌బిపిన్‌ ‌రావత్‌, ‌త్రివిధ దళాల అధిపతులను హాజరయ్యారు. 1962 యుద్ధం తర్వాత చైనా సరిహద్దుల్లో అనేక ఘర్షణలు జరిగినా, ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం. సైనికాధికారి సహా ముగ్గురు మరణించడంతో భారత్‌ ‌దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్‌ ‌చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయని సంకేతాలు అందుతున్న వేళ ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది.

  • భారత్‌ ‌దళాలు హద్దు రాయి
  • చైనా విదేశాంగ శాఖ ప్రకటన

లడాఖ్‌లోని గాల్వన్‌ ‌వ్యాలీలో జరిగిన సైనిక ఘర్షణపై చైనా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్‌ ‌డియాతో మాట్లాడారు. లడఖ్‌ ‌సరిహద్దు వద్ద భారత బలగాలు హద్దురినట్లు ఆయన ఆరోపించారు. భారత సైన్యం దూకుడు ప్రదర్శించిందన్నారు. దాని వల్లే రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నట్లు జావో తెలిపారు. భారత్‌ ‌తమ బలగాలను హద్దుల్లో పెట్టుకోవాలని, ఏకాభిప్రాయానికి తగినట్లు ఉండాలని జావో సూచించారు. ఫ్రంట్‌లైన్‌ ‌దళాలు తమ భూభాగంలోకి రాకూడదంటూ చైనా విదేశాంగ శాఖ వార్నింగ్‌ ఇచ్చింది. బోర్డర్‌ ‌లైన్స్ ఎట్టి పరిస్థితుల్లో దాటవద్దన్నారు. గాల్వాన్‌ ‌వ్యాలీలో జరిగిన తాజా ఘర్షణలో.. రెండు దేశాలకు చెందిన సైనికులు మృతిచెందారు. అయితే చైనా బలగాల్లో ఎంత మరణించిన దానిపై క్లారిటీ లేదు. తొలుత అయిదుగురు చైనా సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చినా.. వాటిని ఆ దేశం కొట్టిపారేసింది. కానీ మృతుల సంఖ్యను వెల్లడింలేదు. భారత్‌కు చెందిన ముగ్గురు సైనికులు మృతిచెందారు. దాంట్లో ఓ కల్నల్‌ ‌కూడా ఉన్నారు. అయితే గాల్వాన్‌ ‌వ్యాలీలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు మంతనాలు జరుపుతున్నారు.

Leave a Reply