Take a fresh look at your lifestyle.

తిరుమలలో అగ్నిప్రమాదం

పూర్తిగా మాడిపోయిన దశలో ఒకరి మృతదేహం
‌తిరుమల దుకాణాల వద్ద అగ్నిప్రమాదం సంభవించి ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి. మంగళవారం ఉదయం వెంకటేశ్వరుడి ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. మంటలు రాజుకొని ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

తిరుమల కొండపై గల ఆస్థానమండపంలోని దుకాణాలలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. 84వ నెంబర్‌ ‌దుకాణంలో ఓ యువకుడి శవాన్ని పోలీసులు గుర్తించారు. బాడీ పూర్తిగా కాలిపోవడంతో దుకాణాదారులు గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

Leave a Reply