నూతన సచివాలయంలో మంటలు..
దురదృష్టం అన్న బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్
నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరం..అని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి..అని పేర్కొంటూ..తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం.. అనీ..సీఎం పుట్టిన రోజునే (ఫిబ్రవరి 17న) కొత్త సచివాలయ ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి..అని పేర్కొంటూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలి..
ఫైర్ సేఫ్టీసహా అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి..అని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు.