Take a fresh look at your lifestyle.

మాస్కు ధరించకుంటే జరిమానా: సిపి

వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలోని ప్రజలు ఇకపై తప్పని సరిగా మాస్కు ధరించని పక్షంలో జరిమాన వేస్తానమని ప్రజలను వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌ప్రమోద్‌ ‌కుమార్‌ ‌హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు, రోజుకి విస్తరిస్తున్న కరోనా వ్యాధిని నియంత్రించడం కోసం ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వ ఇచ్చిన అదేశాలను గౌరవించాలని తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు, తోటి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

ఎవరైన ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి మాస్కు ధరించకుండా తిరిగితే వారిపై డిజాస్టర్‌ ‌మెనేజ్‌ ‌మెంట్‌ ‌యాక్ట్ 51(‌బి) చట్టాన్ని అనుసరించి జరిమానా విధిస్తామని వివరించారు. వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలోని అన్ని పోలీస్‌ ‌స్టేషన్ల పరిధిలోని బహిరంగ ప్రదేశాలతో పాటు ముఖ్యమైన కూడళ్ళు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార సముదాయల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, ఈ తనీఖీలో మాస్కు ధరించకుండా పట్టుబడిన వారిపై క్షేత్ర స్థాయిలోనే జరిమానా విధిస్తామని వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తెలిపారు.

Leave a Reply