Take a fresh look at your lifestyle.

రాష్ట్రానికి ఇలాంటి సీఎం దొరకడం మన దౌర్భాగ్యం…

గురువారం ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క , శ్రీధర్‌ ‌బాబులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో మాట్లాడుతున్న దృశ్యం గత నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రం భయం గుపిట్లో బతుకుందని కాంగ్రెస్‌ ‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి సీఎం-ప్రభుత్వం దొరకడం మన దౌర్భాగ్యమన్నారు. గురువారం ఎమ్మెల్యే లు భట్టి విక్రమార్క ,శ్రీధర్‌ ‌బాబు లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ‌ని కలిసి రాష్ట్రం లో కరోనా వల్ల నెలకొన్న పరిస్థితి ని ,ఉస్మానియా హాస్పిటల్‌ ‌పక్కకు ఉన్న కాళీ స్థలంలో కొత్త హాస్పిటల్‌ ‌కట్టాలని వినపతిపత్రం అందించారు.అనంతరం సిఎల్పీ లోని మీడియా పాయింట్‌ ‌లో ప్రెస్‌ ‌మీట్‌ ‌నిర్వహించారు.ఈ సందర్భంగా భట్టి ,శ్రీధర్‌ ‌బాబు మాట్లాడుతూ …ప్రజలందరూ భయంతో బతుకుతుంటే- రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఫామ్‌ ‌హౌస్‌ ‌కి వెళ్లారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.ఉన్న అప్పులు సరిపోవడం లేదని-మళ్ళీ కొత్త అప్పుల కోసం ఆర్డినెన్స్ ‌పై గవర్నర్‌ ‌సంతకం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నాలుగైదు నెలల్లో మరో 30వేలు కోట్లు అప్పులు చేశారని , ఇప్పుడున్న 3లక్షల కోట్ల అప్పులను ఐదారు లక్షల కోట్ల అప్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయిందని ఆరోపించారు.ప్రజల అవసరం అయిన వైద్య-విద్యను పక్కకు పెట్టి- సెక్రటేరియట్‌ ‌కూల్చడం కొత్త ప్రాజెక్టుల టెండర్లు పిలుస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి కాకుండా-రాష్ట్రం దొరికింది కదా అని- స్వాహా చేస్తున్నారని విమర్శించారు.
సీఎం కుమారుడు కేటీఆర్‌ ఇం‌గ్లీషు మాటలు తప్ప- పరిపాలన మాత్రం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు-తేవాలనుకుంటున్న అప్పుల పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు.ఉస్మానియా ఆసుపత్రి ఆవరణంలో ఉన్న ఖాళీ స్థలంలో నూతన హాస్పిటల్‌ ‌నిర్మించాలని ఆరేళ్ళ కిత్రం చెప్పినా పట్టింపు లేదన్నారు .ప్రభుత్వం కొరొనా విషయంలో శుత్తశుద్ది తో పనిచేయడం లేదని మాజీ మంత్రి శ్రీధర్‌ ‌బాబు మండిపడ్డారు.ప్రజలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. కొరొన తో చనిపోతే ఆ మృతడేదాన్ని పట్టించుకునే నాథుడే లేడు-ప్రత్యక్ష ఆదరణ కరీంనగర్‌ ‌లో జరిగిన సంఘటనని గుర్తు చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ‌లో ఉన్న సమస్యలకు కారణం- సీఎం,వైద్యశాఖ మంత్రే అన్నారు.ఉస్మానియా హాస్పిటల్‌ ‌నిర్మాణం ఎవ్వరు అడ్డుకోలేదు! హెరిటేజ్‌ ‌భవనం ఉన్న చోట కాకుండా పక్కనే కట్టాలని కోరామన్నారు.కొరొనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని వైద్యశాఖ మంత్రి ఈటెలను కోరిన్నట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!