Take a fresh look at your lifestyle.

సచివాలయ నిర్మాణంతో ఆర్థిక భారం

కూల్చేయాలని హైకోర్టు ఎక్కడా చెప్పలేదు : టీజేఎస్‌ అధ్యక్షుడు, ప్రొ।। కోదండరామ్

సచివాలయం కూల్చివేతపై హైకోర్ట్ ‌వ్యాఖ్యలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. సచివాలయం కూల్చివేయొచ్చని ధర్మాసనం ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సచివాలయం కూల్చివేత నిర్ణయం సరికాదని ఆయన తెలిపారు. దాన్ని ఆపేందుకు ప్రతిపక్షాలుగా తాము చేయాల్సింది చేస్తామని అన్నారు. సచివాలయం కొతత్గా కట్టాలన్న నిర్ణయం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడనుందని అన్నారు. ఈ సమయంలో సచివాలయ నిర్మాణం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. కరోనా విషయంలో తగు చర్యలు తీసుకోవడం లేదని కోదండరామ్‌ ‌మండిపడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ‌మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని.. వాస్తవాలను కప్పిపెట్టే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. చెస్ట్ ఆసుపత్రి ఘటనపైన సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌ ‌చేశారు. కోవిడ్‌ ‌కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పుర్తిగా విఫలం అయ్యిందని కోదండరాం వ్యాఖ్యానించారు.

Leave a Reply