Take a fresh look at your lifestyle.

బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం..!

  • ఆటో,టాక్సీ  డ్రైవర్ లకు నెలకు 5 వేలు
  • దిల్లీ సర్కార్ కొరొనా చర్యలు
  • ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,మే 4:
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 5 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా రెండు నెలలు ఉచిత రేషన్ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అందిస్తున్నారు. ఒక వైపు కరోనా విజృంభణ, మరోవైపు లాక్ డౌన్ తో అల్లాడుతోన్న పేద ప్రజలను ఢిల్లీ సర్కార్ ఆదుకోవడానికి నడుం బిగించింది. పేద, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటన చేసింది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు నెలకు ఐదు వేలు ఇవ్వనున్నట్లు సిఎం కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. ఈ డబ్బులు నేరుగా వారి అకౌంట్లలో జమచేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.ఈ ఆర్థిక సహాయం తో పాటు, రేషన్ కార్డు లు కలిగిన 72 లక్షల కుంటుంబాలకు రెండు నెలలు ఉచితంగా రేషన్ అందించనున్నట్లు తెలిపారు.ఇలా ఆర్ధిక తిండి భరోసా కార్యక్రమం చేపడుతున్నాం అంటే రెండు నెలలు లాక్ డౌన్ కొనసాగుతుందని అర్ధం కాదు అని కేజ్రీ స్పష్టం చేశారు. వైరస్ చైన్ తెంచేందుకు, వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుతం లాక్ డౌన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తుందన్నారు. అయితే, దీంతో చాలా మంది పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందిపడుతున్న విషయం ఆందోళన కలిగిస్తుందన్నారు.  “కరోనా, లాక్ డౌన్ కారణంగా పేదలు ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ తన వంతుగా ఇతరులకు సహాయం అందించాలి”అని సిఎం కేజ్రీ అన్నారు. లాక్ డౌన్ కారణంగా ఆటో, రిక్షా డ్రైవర్ల పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గత లాక్ డౌన్ కాలంలోనూ వీరికి ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తు చేశారు.  పాజిటీవ్ నిర్ధారణ అయిన పేద కుటుంబాలకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తామన్నారు. కాగా, మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెక్స్ ఫుల్ గా సాగుతుందన్నారు.  18–44 ఏళ్ల మధ్య వారు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు అని తెలిపారు.  మరోవైపు రాం లీలా మైదాన్ లో 500 ఐసీయు బెడ్ల కోవిడ్ హాస్పిటల్ ను యుద్ధ ప్రతిపాదికన నిర్మిస్తోన్నట్లు డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా తెలిపారు. మంగళవారం హెల్త్ మినిస్టర్ సత్యేంత్ర జైన్ తో ఈ సెంటర్ల ను పరిశీలించారు.  త్వరలోనే ఈ కోవిడ్ సెంటర్ అందుబాటులోకి వస్తుందని సిసోడియా మీడియాకు తెలిపారు.
శ్మశాన వాటికలు పెంచండి…
పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతోన్న ఢిల్లీ లో శ్మశాన వాటికలు, క్రిమేషన్ గ్రౌండ్స్ పెంచాలని ప్రభుత్వానికి, రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Leave a Reply