వేంకటేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు
ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఉదయం 11.30 గంటలకు శాసన సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సందర్బంగా ముందుగా జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలు జరగుఉతన్న సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఇక్కడికి వచ్చి స్వామి ఆశీర్వచనం పొందారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో 2021-22 బ్జడెట్ను సభలో ప్రవేశపెట్ట బోతున్నామని చెప్పారు. ప్రజలందరికి మంచి జరగాలని, సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పేదల సంక్షేమం కోసం, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా బడ్జెట్ను రూపొందించామని చెప్పారు. స్వామివారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ బడ్జెట్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నిరకాలుగా మేలు చేస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం ఉందని చెప్పారు.