కందులు, బియ్యం దిగుమతలను కట్టడి చేయాలి
- దీంతో దేశీయ రైతులకు తీరని అన్యాయం విధానాలపై సక్షించాలి
- కేంద్రానికి ఆర్థికమంత్రి హరీష్‌రావు సూచన
ఎగుమతి, దిగుమతుల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సక్షించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతులకు నష్టం కలిగే ఈ పాలసీపై కేంద్రం సక్ష చేయాలన్నారు. సంగారెడ్డి జిల్లా కంకోల్ మండలంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి నేడు శంకుస్థాపన చేశారు. అంతకు క్రితం పల్లెప్రగతిలో భాగంగా రాయికోడ్ మండలం సంగాపూర్ గ్రామంలో నిర్మించిన వైకుంఠదామం, డంపింగ్ యార్డ్, చిల్టన్్ర పార్క్‌ను మంత్రి ప్రారంభించారు. హరితహారంలో భాగంగా పార్క్‌లో మొక్కలు నాటారు. రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం మంత్రి మాట్లాడుతూ… రైతు వేదికకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రైతులు సంఘటితంగా ఉండాలని సీఎం ఆలోచన అన్నారు. అందుకే రైతు వేదికల నిర్మాణాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. రైతు వేదికల ద్వారా రైతులంతా ఒక దగ్గర కూర్చూని ఏ పంట వేయాలి? ఎక్కడ, ఏ ధరకు పంటను అమ్ముకోవచ్చు వంటి సమాలోచనలు చేయొచ్చన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులు రైతులకు సాహాయం చేస్తారన్నారు.
రైతు కోసం ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. కేంద్రం ఎగుమతులు, దిగుమతుల విధానాన్ని సక్షించాలని మంత్రి హరీశ్ అన్నారు. కేంద్రం కందులను ఆఫ్రికా నుంచి ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసుకుంటోందన్నారు. ఇక్కడి రైతులకు లాభం జరగాలంటే, మంచి ధర రావలంటే కేంద్రం కందులను దిగుమతి చేసుకోవడం నిలిపివేయాలన్నారు. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధర పెరిగితే ఎగుమతి బంద్ చేస్తారు. ఇది సరికాదన్నారు. ధర పెరగడం వల్లే రైతుకు లాభం అన్నారు. కందులు, బియ్యం బయటి దేశాల నుంచి తెస్తే ఇక్కడి రైతుల పరిస్థితి ఏంటో ఆలోచించాలన్నారు. ఇలాంటి ప్రభుత్వ విధానాల వల్లే నష్టం జరుగుతోందన్నారు. మధ్యతరగతి ప్రజానీకానికి సాయం చేయాలంటే రైతు వద్ద కొని రాయితీతో అందజేయాలన్నారు. పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధర పెరిగితే అది సీసీఐకి లాభం. కానీ రైతుకు మాత్రం ఏ లాభం జరగడం లేదన్నారు. లాభాన్ని కూడా రైతుకు పంచాల్సిన బాధ్యత సీసీఐపైన, కేంద్ర ప్రభుత్వంపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జెడ్పీటీసీ నాక్షి, జడ్పీటీసీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, మండల ఉపాధ్యక్షులు బాబు పటేల్ పాల్గొన్నారు.