Take a fresh look at your lifestyle.

దళిత బంధు ఆపింది బీజేపీనే…

  • దీన్ని రుజువు చేస్తా….ఏ బీజేపీ నేత వొస్తరో రండి
  • బీజేపీ నేతలకు జమ్మికుంట ఎన్నికల ప్రచారంలో ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు సవాల్‌

‘‘ఇవాళ దళిత బంధు సీఎం గారు ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ ‌రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఈ నెల 7వ తేదీన లేఖ రాసిండు…అధికార దుర్వినియోగం అవుతుందని, ఈ డబ్బులు వొస్తే ఆ పార్టీకి లాభం చేకూరుతుందని లేఖ రాస్తే. ఈ నెల 30వ తేదీ వరకు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ప్రేమేందర్‌ ‌రెడ్డి లేఖ రాసినట్లు రుజువు చేయడానికి నేను రడీగా ఉన్న. ఏ బీజేపీ నాయకుడు వొస్తడో ముందుకు రండి…ఏడు రోజులు ఆపుతరు అంతే. గెల్లుకు, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి, కేసీఆర్‌కు పేరు వొస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ ‌రెడ్డి లేఖ రాసి దళిత బంధును ఆపిండ్రు..అని మంత్రి హరీష్‌ ‌రావు బుధవారం జమ్మికుంటలో నిర్వహించిన ఎన్నికల సభలో బీజీపీ నాయకులకు సవాలు విసిరారు. ‘నడుమంతర వోట్లు వొచ్చాయి. నాలుగు నెలల నుంచి రణ గొణ చప్పుళ్లు వింటున్నం..వోటు ఎవరికి వేయాలి. వోటు వేస్తే ఏం జరుగుతది..కొద్దిగా ఆలోచించాలి. . ‘‘ఏ తోవలో వెళ్తే మనకు లాభం. ఏ దారిన వెళ్తే డబులు బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు వొస్తది…మనకు అన్నం పెట్టే వాళ్లు ఎవరు…మనకు సున్నం పెట్టే వాళ్లు ఎవరు ఆలోచించాలి. అని సూచిస్తూ..‘‘ఇవాళ టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ. తెలంగాణ కోసం కొట్లాడి..రాదనుకున్న తెలంగాణను తెచ్చిపెట్టిండు కేసీఆర్‌..‌తెచ్చుకున్న తెలంగాణలో 200 పెన్షన్‌ 2016 ‌రూపాయలు చేసుకున్నం..నా కన్నకొడుకు చూసినా చూడకపోయినా నా పెద్ద కొడుకు కేసీఆర్‌ 2016 ‌రూ. పంపుతున్నరని ప్రతీ అవ్వ అంటుంది..ఆడ పిల్ల పెళ్లి పెట్టుకుంటే పేదింటికి కాంగ్రెస్‌, ‌బీజేపీ, టీడీపీ ఏ ప్రభుత్వం అయినా సాయం చేసిందా ఆలోచించాలి. మొదటి ఏడాది పేదవాళ్లయిన ఎస్సీలకు 50 వేలు ఇచ్చిండు. తర్వాత బీసీలకు ఇచ్చిండు.

ఆ తర్వాత అన్ని కులాలు, మతాల వారిలో పేదలకు లక్ష నూట పదహార్లు ఇచ్చిండు…రేపు దళిత బంధు కూడా ఇలా పేదలందరికీ వొస్తది. బీజేపీ వాళ్లు ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు చెప్తూ…. మన మనసులు కరాబు చేస్తరు. బీజేపీ వాళ్లు అసలు ఏం చేస్తరో మాత్రం చెప్పడం లేదు. నేను చెప్పిన ఆసరా పెన్షన్‌ ఇవ్వండ లేదా.. పేదింటి ఆడపిల్లకు లక్ష నూట పదహార్లు రావడం లేదా.. కేసీఆర్‌ ‌కిట్‌ ‌రావడం లేదా. సీఎం కేసీఆర్‌ ‌పేదలను కాపాడాలని 12 వేలు, కేసీఆర్‌ ‌కిట్‌ ఇచ్చి కాన్పు చేసి ఆటో కిరాయి ఇచ్చి ఇంటికి పంపుతున్నరు. ప్రజలకు ఏం కావాలో ఆలోచిస్తున్న ప్రభుత్వం. అంగన్‌ ‌వాడీలో బాలామృతం, కోడి గుడ్లు ఇస్తున్నం…పిల్లల పెద్దయితే గురుకులాల్లో సన్న బియ్యంతో బోజనం పెట్టి, ఇంగ్లీషు మీడియంలో చదవిస్తున్నం..24 గంటల కరెంటు ఇస్తున్నది టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమా కాదా.

దళిత బంధు ఆపింది బీజేపీనే...

బీజేపీ ఏం చేసింది…రాజేందర్‌ ‌చేరిన పార్టీ బీజేపీ. దీని పేరు జీడీపీగా మార్చాలి. గ్యాస్‌ ‌డిజిల్‌ ‌పెట్రోల్‌ ‌రేట్లు పెంచే పార్టీగా పేరు మార్చుకోవాలి. ఈ బీజేపీ పాలనలో ఈ 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్‌, ‌డీజీల్‌ ‌ధరలు పెంచిండ్రు. దీంతో రవాణా చార్జీలు పెరిగి ఉప్పు, పప్పు, కూరగాయలు, నూనె ధరలు పెరిగాయి. ఇన్ని ధరలు పెంచినా రాజేందర్‌ ‌నాకు వోటు వేయండి అంటున్నరు. 500 నుంచి 250కి గ్యాస్‌ ‌సబ్సిడీ తగ్గించారు. దాన్ని 40కి తగ్గించారు. గ్యాస్‌ ‌ధర మాత్రం 1030 రూ చేశారు. మమ్మల్ని గెలిపిస్తే పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌ధరలు తగ్గిస్తమని చెప్పారు. తగ్గించకపోగా డబుల్‌ ‌చేసిండ్రు…రాజేందర్‌ ‌గ్యాస్‌ ‌సిలండర్‌ ‌తగ్గించమని అడిగే, రాష్ట్ర ప్రభుత్వం 291 రూ పన్ను వేస్తుంది..అది తగ్గించు అన్నరు. నేను జమ్మికుంట గాంధీ విగ్రహం వద్దకు వొస్తా. 291 రూ పన్ను రాష్ట్ర ప్రభుత్వం వేస్తే నేను అక్కడే రాజీనామా చేసి నేలకు ముక్కు రాసి వెళ్తా అన్నా.

రావాలి కాదా..రాలేదు. తేలు కుట్టిన వ్యక్తిలా వెళ్లిపోయారు. బీజేపీ ప్రభుత్వమే వేయి రూపాయలు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం పన్ను లేనే లేదు…మీరు ఆలోచించాలి. పెన్షన్‌, ‌రైతు బంధు, కల్యాణ లక్ష్మి ఇచ్చి సాయం చేసిండ్రు కేసీఆర్‌…‌వాళ్లేమి చేస్తున్నరు. గ్యాస్‌ , ‌పెట్రోల్‌, ‌డిజీల్‌ ‌ధరలు పెంచి. ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు. రైళ్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌, ‌విమానాశ్రయాలు అమ్ముతున్నరు. నెల రోజులు ఓపిక పట్టండి పెద్ద నోట్లు రద్దు చేస్తున్నం. జన్‌ ‌ధన్‌ అక్కౌంట్లు ఓపెన్‌ ‌చేయండి. ధనా దన్‌ ‌డబ్బులు వెస్తాం అన్నారు. నెల రోజులు తిప్పారు. తప్ప నల్ల ధనం బయటకు రాలేదు…విదేశాల నుంచి నల్ల ధనం తెచ్చి ప్రతీ అక్కౌంట్లో 15 లక్షలు వేస్తాం అన్నరు. వొచ్చినయా పైసలు అక్కౌంట్ల లోకి. రాజేందర్‌ ‌బీజేపీకి వోటు ఎందుకు వేయాలి అని అడుగుతున్న…రాష్ట్రంలో మంత్రులంతా ఇల్లు కట్టించాం. కాని హూజూరాబాద్‌ ‌లో ఎందుకు ఇళ్లు కట్టించలేదు…మంత్రిగా ఇళ్లు కట్టించలేని రాజేందర్‌ ‌ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కడతడా అయితదా ఆలోచించండి…30 వ తేదీతో ఓట్లు అయితది. తర్వాత సీఎం ఎవరు ఉంటరు. కేసీఆర్‌ ‌గారే ఉంటరు. ఆర్థిక మంత్రి గా నేను, జిల్లా మంత్రిగా కొప్పుల ఈశ్వర్‌ ఉం‌టుర. మేం మాటిస్తున్నాం.

ఐదు వేల ఇళ్లు కట్టిస్తాం…స్వంత జాగా ఉంటే ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తం…పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించాలి. నెలకు రెండు సార్లు హూజూరాబాద్‌కు వొస్తా. ఏ పనులైతే హమీ ఇచ్చినమో..మేం దగ్గరుండి పనులు నడిపిస్తా అని హామీ ఇస్తున్నా…కొన్ని పనులు జరుగుతున్నయి జమ్మికుంటలో. బరువు మా మీద పెట్టండి. కారుకు వోటు వేయండి…ఈ బ్రిడ్జి బాగాలేదని అన్నా… రాజేందర్‌ ‌మెడ మీద కత్తిపెట్టి కట్టిండని, వాస్తు పోయిందని ఇక్కడి ప్రజలు అంటున్నరు. తన స్వార్థం కోసం రాజీనామా చేసిండ్రు. రాజేందర్‌ ‌గెలిస్తే బీజేపీకి లాభం. గెల్లు గెలిస్తే… ఇక్కడి ప్రజలకు లాభం…నాయిని చెరువును బాగు చేయాలన్నరు. నాయిని చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతం…ఆడిటోరియం లేదు. ఆరు సార్లు గెలిచిండు. ఒక్క టౌన్‌ ‌హాలు ఉందా.. ఒక్క మహిళా భవనం ఉందా…సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ఆపీసు ఉందా…హౌసింగ్‌ ‌బోర్డు వర్షాలు పడితే వరదల మయం. ఆగమాగం. మంత్రిగా ఉండి ఏం పట్టించుకున్నరు…వరద కాలువకు ఎన్ని డబ్బులు ఖర్చయినా..శాశ్వత పరిష్కారం అందిస్తా. గెల్లు శ్రీనును గెలిపించండి…ఈ ప్రాంతంలో కుటీర పరిశ్రమలు వొస్తే పనులు దొరుకుతాయంటున్నరు. తప్పకుండా గెల్లును గెలిపించండి. కుటీర పరిశ్రమలు తీసుకు వొస్తాం…వడ్డీలేని రుణం పండుగ ముందు అందించాం…. అగ్గిపెడతా.. కూలగొడతా… ఘోరీ కడతా…. అంటున్నడు తప్ప సేవ చేస్తా అంటున్నడా….తిడితే కడుపు నిండుతదా.. గ్యాస్‌ ‌ధర తగ్గిస్తవేమో చెప్పు…రెండో తేదీ తర్వాత వొస్తం. నేను కొప్పుల ఈశ్వర్‌ అన్న దగ్గరుండి దళితులందరికీ యూనిట్లు గ్రౌండ్‌ ‌చేయిస్తం…30వ తేదీ తర్వాత ఎవరు ఉంటరు ఇక్కడ. ఎవరూ ఉండరు. సీఎంగా కేసీఆర్‌ ఉం‌టరు. మేమే ఉంటం…కారు గుర్తుకు వోటు వేయండి…అని మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు.

 

Leave a Reply