Take a fresh look at your lifestyle.

కట్టేటోళ్లు కావాలా…? కూలగొట్టే టోళ్లు కావాలా…?

పఠాన్ చెరు – మున్నూరు కాపు సంగం ఆత్మీయ సమ్మేళనం లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు.

బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు వోట్లు అడుగుతున్నారు…ఈరెండు పార్టీలు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందా..? అని రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. శుక్రవారం పఠాన్ చెరు – మున్నూరు కాపు సంగం ఆత్మీయ సమ్మేళనం లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ..కాంగ్రెస్, బీజేపీలు ఏం మాట్లాడుతున్నారో చూశారా..ప్రజల మధ్య విషం చిమముతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు.సర్జికల్ స్ట్రైక్స్ అభివృద్ధి మీద, నిరుద్యోగ మీద, పేదరికం మీద చేయండి..అని బీజేపీ కి సూచించారు. బాంబులు వేసే వాళ్ళు, కులకొట్టే వాళ్ళు కావాలో .. అభివృద్ధి, నిర్మాణం చేసే వాళ్ళు కావాలావిషయం కావాలా.. విషం కావాలా తేల్చుకోవాలని ఓటర్లకు సూచించారు.ప్రజలు ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారు..ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే పెట్టుబడులు పుష్కలంగా వస్తాయని ..భారతీయ జనతా పార్టీ చరిత్ర ప్రజలందరికీ తెలుసు.. మతం పేరుతో ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేస్తున్నారు..అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేతులెత్తేసింది.. అంతర్గతంగా బిజెపి పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తోంది..కెసిఆర్ నాయకత్వం బలపడాలంటే జీహెచ్ఎంసీ ఎన్నిక లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్జికల్ స్ట్రైక్ కి సంబంధం ఉందా..ఒకపక్క ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోం టే.. మరోపక్క బిజెపి నాయకులు. బాంబులు వేస్తాం సర్జికల్ strikes చేస్తామంటూ విషం చిమ్ముతున్నారు..తెరాస వచ్చి ఏడేళ్ల అవుతుంది. పఠాన్ చెరులో మార్కెట్ వాల్యూ పెంచాం. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచలేదు. పన్నుల భారం ఉండోద్దని ప్రజలకు ఆసరా ఉన్నాం..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం..కాని ఈ పార్టీలు విధ్వంసం కోసం మాట్లాడుతున్నాయి అన్నారు. సాకి చెరువును మంచిగా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు.దారుసలాం కూలగొట్టే వాళ్లతో పఠాన్ చెరుకు ఏం లాభం..పీవీ సమాధి కూలగొడితే పఠాన్ చెరు ప్రజలకు ఏం లాభం..నిజంగానే హైదరాబాద్ వాతావరణం చెడిపోయి కర్ఫ్యూలు పెడితే, మతాల చిచ్చు ఉందని తెలిస్తే…ప్రయివేటు సంస్థలు, ఫ్యాక్టరీలు వస్తాయా.. భూముల ధరలు పెరుగుతాయా..అని ప్రశ్నించారు.ఇవన్నీ మనకు నష్టం చేసేవి కాదా..ప్రశాంత హైదరాబాద్ కావాలి.. అంటే కేసీఆర్ నాయకత్వం బలపడాలి. అంటే జీహెచ్ఎంసీలో తెరాస గెలవాలి అని పిలుపునిచ్చారు.

Leave a Reply