Take a fresh look at your lifestyle.

ఆర్థిక క్రమశిక్షణలో రికార్డు

అనవసర అబద్దాల ప్రచారంలో విపక్షం:ఆర్థికమంత్రి బుగ్గన రాజేందర్‌
అమరావతి, జూన్‌ 25 : ‌రాష్ట్ర ప్రభుత్వ మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణతో రికార్డు సృష్టించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్ష టీడీపీ, దాని స్నేహపూర్వక డియా అబద్దాలు వల్లె వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరానా వ్యాప్తి ఉన్నప్పటికీ అధికారులు బాగా పనిచేశారని అభిప్రాయపడ్డారు. టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు బాగానే ఉన్నాయని, ఇప్పుడు అప్పటికన్నా ఆర్థిక పరిస్థి ఎంతో మెరుగ్గా ఉన్నదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య వార్షిక రుణ వృద్ధి రేటు 19.2 శాతం ఉండగా, వైసీపీ ప్రభుత్వంలో 15.77కి తగ్గించామని మంత్రి బుగ్గన చెప్పారు. రాష్ట్ర ఆర్థిక లోటు గత ప్రభుత్వంలో సగటున జీఎస్‌డీపీలో 4 శాతంగా ఉండగా.. 2021-22లో 2.10 శాతంగా ఉన్నదన్నారు. అలాగే, రాష్టాన్ని్ర శ్రీలంకతో పోల్చినందుకు ప్రతిపక్షాలు తమ తప్పును తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) పథకాల కింద పారదర్శకంగా రూ.1.46 లక్షల కోట్లను లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా పంపిణీ చేసిందని, డిబిటియేతర పథకాల కోసం మరో రూ.44,000 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో రూ.27,340 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ‌పనులు జరగ్గా.. గత మూడేండ్లలో మొత్తం రూ.27,448 కోట్ల పనులు చేపట్టినట్లు మంత్రి వివరించారు. టీడీపీ హయాంలో రుణాలపై సగటు వడ్డీ రేటు 8 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 7 శాతంగా ఉన్నదన్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులపై ప్రతిపక్షాలు దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. స్థానిక సంస్థల విద్యుత్‌ ‌ఛార్జీల పెండింగ్‌లో ఉన్న రూ.2,200 కోట్ల బకాయిలను ప్రభుత్వం క్లియర్‌ ‌చేసిందన్నారు. కొవిడ్‌ ‌వ్యాప్తిలో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంలో 2014-19 మధ్య భారీ, మధ్య తరహా ప్రాజెక్టులలో సగటు పెట్టుబడి రూ.11,994 కోట్లుగా ఉన్నదని ఆయన చెప్పారు.

Leave a Reply