నెక్కొండలో సినీ నటుడు పృథ్విరాజ్ సందడి చేశారు. గురువారం కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి వెళుతున్న ఆయన మార్గ మధ్యలో నెక్కొండలోని ఓ కిరాణం షాపు వద్ద ఆగి అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి తమ కుటుంబ సభ్యులకు నిలువెత్తు బెల్లాన్ని (బంగారం) తులాభారం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్తునట్లు ఆయన తెలిపారు. సినీ నటుడు నెక్కొండలో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్థులు ఆయనను చూడడానికి పోటీ పడ్డారు.
Tags: film actor,prudviraj,nekonda