
ప్రజాతంత్ర, హైదరాబాద్: పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్ఎస్ ఎంపిలతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చర్చించారు. నిధుల విడుదల, విబజన సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని వారికి సూచించారు. సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల్సిందేనని అన్నారు. కెటిఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంటు బ్జడెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలతో కేటీఆర్ ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరుగు తుందని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యా నించిన విషయం తెలిసిందే. ఈ అంశాలన్నింటికీ దృష్టిలో పెట్టుకొని రానున్న పార్లమెంటు బ్జడెట్ సమావేశాల్లో ఏవిధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ •దా కల్పించి నిధులు కేటాయింపు విషయంలో భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంతో కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
పెండింగ్‌లో ఉన్న విభజన హాలుపై రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రస్తావించాలని.. సంబంధిత మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి పెంచాలని భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాన్ని అభినందిస్తూ పార్లమెంటరీ పార్టీ తీర్మానం చేసింది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు డియాతో మాట్లాడారు. ’మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్కు అద్భుత విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మా పార్టీ విజయం సాధించింది. నీటి పారుదల రంగంలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలు మరో రాష్ట్రం చేయలేదు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల గురించి పార్లమెంటులో అడుగుతాం. వివిధ రంగాల కింద మాకు పన్ను బకాయిలు రావాల్సి ఉంది. జీఎస్టీ బకాయిలు, ఇతర బ్జడెట్ కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీస్తాం. సీఏఏపై సీఎం కేసీఆర్ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ఎన్పీఆర్ అనేది సీఏఏకు ముందస్తు కార్యక్రమమని భావిస్తున్నామని’ కేకే పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 95శాతం సక్సెస్ రేటు మాకు దక్కిందని ఎంపీ నామా నాగేశ్వర్రావు అన్నారు. ఏ నాయకుడికీ ఇవ్వని గౌరవం ప్రజలు సీఎం కేసీఆర్‌కు ఇచ్చారని తెలిపారు.
Tags: it minister ktr, trsparty, caa and nrc, mp nama nageswar rao