దురాచారాలపై ధ్వజమెత్తి
మానవత్వాన్ని మేల్కొలిపి..
పాత్రికేయుడిగా కలం ఎక్కుపెట్టి
అవినీతికి సింహస్వప్నంగా నిలిచి..
బాల్యవివాహాలు ఆపించి
వితంతు వివాహాలు జరిపించి..
Also Read: ఆ పద్దెనిమిది మంది ఎవరు?
యావదాస్తిని సమాజానికి అర్పించి
దాతృత్వానికి దర్పణంగా నిలిచి…
స్త్రీ విద్యను సదా ప్రోత్సహించి
స్త్రీ సాధికారతకు నిర్వచనంగా నిలచి..
ఎన్నో ప్రతిఘటనలను ఎదిరించి
ఆశయాలలో రాజీ లేని ప్రయాణం సాగించి..
సామాజిక రుగ్మతలపై సంఘర్షించి
తెలుగునాట సంస్కరణలకు శ్రీకారం చుట్టి
బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేర్గాంచి
నిరాడంబరంగానే సదా జీవించి..
బడిపంతులుగా జీవితాన్ని ఆరంభించి
నవాయుగ వైతాళికుడిగా కీర్తి సాధించి
ఆంధ్రులకు ఆద్యుడిగా నిలచి
ఆరాధ్యుడిగా గౌరవం సంపాదించి
తెలుగు జాతి ఖ్యాతి నలుదిశలా వ్యాపింప చేశావు
తరతరాలకు ఆదర్శప్రాయుడిగా కీర్తిని ఆర్జించావు..
సంస్కరణాభిలాషి ..సాహితీ పిపాసి నవయుగ వైతాళికుడు కందుకూరి. ఆయనకివే మా అక్షర నీరాజనాలు….
– రుద్రరాజు శ్రీనివాసరాజు…9431239578
లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్..వి.వి.యస్.నారా
తూ. గో.జిల్లా.