శ్రమజీవుల చెమట చుక్కల సుగంధముతో
పాదుకొల్పిన
ఫల సంపదను దళారులకు
పంచే వంచనను పసిగట్టక
దాసోహమైన దగుల్బాజీ తనం వల్లనే కదా
చేనుకు కంచెలాగుండాల్సిన రాజ్యాధికారం చెదపురుగులా మారింది
పాదుకొల్పిన
ఫల సంపదను దళారులకు
పంచే వంచనను పసిగట్టక
దాసోహమైన దగుల్బాజీ తనం వల్లనే కదా
చేనుకు కంచెలాగుండాల్సిన రాజ్యాధికారం చెదపురుగులా మారింది
అంతరాలు సృష్టించబడిన అవనిలో ఆకలికి తట్టుకొని అన్నదమ్ముల్లా బతకడమెలాగో నేర్చుకున్నమ్
ఐక్యతను తగలబెట్టాలనే
దగాకోరు లకు బుద్ధి చెప్పే ఒద్దికను అలవర్చుకోలేమా
కాలే కడుపులకు కూడును బెట్టని జాడ్యాలు విషపురుగుల్లా మెదళ్ళను తొలుస్తున్నయ్
కల్గినవాడి కళ్ళు దూరలేని
దుర్బరదారిద్య్రం
గోడల చాటున వెక్కిరిస్తూ
దేశమాత దేహం పై రాసపుండై సల్పుతున్ళను
అబద్ధాల అంకెలగారడిలో
అభివృద్ధి ఉరకలు పెడుతూనే ఉంటుంది
చట్టాలు సంపన్నుల కొమ్ము గాస్తుంటే
గాయపడ్డ మట్టిబతుకులు
గర్జించే సింహాలై
రాజధాని వీధుల్లో రణకేతనమయ్యిండ్లు
నివురు గప్పిన నిప్పులాగున్న
శాంతి కాముకుల సత్తువ
నింగినంటుకొంటున్నది
అలుముకున్న చీకట్లను చీల్చి వెలిగే కిరణాల్లా
ఆకలికేకల సమరం
కొడిగట్టిన ఆశలకు
పునర్జీవమవుతున్నది.
– గన్ రెడ్డి ఆదిరెడ్డి, 9494789731