Take a fresh look at your lifestyle.

సిఎఎ, ఎన్‌ఆర్‌సిలపై పార్లమెంటులో లొల్లి

Union Finance Minister Anurag Thakur

సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ఇబ్బందిపడిన మంత్రి

పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సీ)లపై ఉభయసభల్లో ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. బ్జడెట్‌ ‌సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ ‌సహా ప్రతిపక్షాల సభ్యులు షేమ్‌.. ‌షేమ్‌.., ‌సేవ్‌ ఇం‌డియా, సేవ్‌ ‌డెమోక్రసీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థంకాక గందరగోళం నెలకొంది. సీఏఏ, ఎన్నార్సీలపై చర్చకు కాంగ్రెస్‌, ‌బీఎస్పీ, వామపక్షాలు పట్టుబట్టాయి. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ) ‌సభ్యులు సైతం ప్రతిపక్షంతో గొంతు కలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చను ప్రతిపక్ష సభ్యులు పదే పదే అడ్డుకున్నారు. విపక్ష సభ్యుల మధ్యే ప్రస్తుతం చర్చ కొనసాగింది. మరోవైపు రాజ్యసభలోనూ తీవ్ర గందర గోళం నెలకొనడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు.

అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నిరసన

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో ఇవాళ ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయన మాట్లాడేం దుకు నిలబడిన ప్రతిసారీ… గోలీ మంత్రి.. గో బ్యాక్‌.. అం‌టూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. కాల్పులు ఆపండి.. అంటూ డిమాండ్‌ ‌చేశారు. దీంతో సభ్యుల అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు మంత్రి ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇటీవల కేంద్రమంత్రి ఠాకూర్‌ ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారు దేశద్రోహులనీ.. వారిని కాల్చిపారేయాలంటూ ఠాకూర్‌ ‌పేర్కొన్నారు. దేశ్‌ ‌కే గద్దారోంకో అంటూ మంత్రి నినాదం ఇవ్వగానే.. అక్కడ ఉన్న జనం అంతా గోలీ మారో అంటూ నినాదాలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడంతో.. ఆయన ప్రచారంపై మూడు రోజుల పాటు నిషేధం విధించారు. కాగా మంత్రి ఠాకూర్‌ ఈ ‌వ్యాఖ్యలు చేసిన నాటి నుంచి ఇప్పటికి మూడు సార్లు సీఏఏ నిరసనకారులపై కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే సభలో ప్రతిపక్షాలు మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర నిరసన చేపట్టాయి.

Leave a Reply