Take a fresh look at your lifestyle.

‌ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడండి

పార్టీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు పిలుపు
విజయవాడ,జూలై26 : ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పోరాడాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని అన్నారు. టీడీపీ సీనియర్‌ ‌నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రజాసమస్యలపై చర్చించి టీడీపీ కార్యాచరణ రూపొందించారు. గోదావరి వరద ముంపు, వర్షాల వల్ల ఆదివాసీలు నష్టాల్లో కూరుకుపోయారని, పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని నేతలు మండిపడ్డారు. బాధితులందరికీ వెంటనే పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్‌ ‌చేశారు.

గృహనిర్మాణానికి ప్రభుత్వం రూ.2 లక్షల సబ్సిడీ ఇవ్వాలి. టిడ్కో గృహాల్ని వెంటనే లబ్దిదారులకు అందించాలని చంద్రబాబు డిమాండ్‌ ‌చేశారు. ఇదిలావుంటే రైతులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ తెలిపారు. సోమవారం ఆయన డియాతో మాట్లాడుతూ రెడ్డిగూడెం మండలంలోనే రైతులకు రూ.14కోట్ల బకాయిలు రావాలన్నారు. అంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతు భరోసా కేంద్రాలంతా బోగస్‌ అని తప్పు బట్టారు. దళారులు, రాజకీయ నేతలు కుమ్మకై రైతులను దోచుకుంటున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.

Leave a Reply